అగ్నివీర్‌గా ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పని చూసి 47 గ్రామాలు ఒక్కటయ్యాయి!

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ అగ్నివీర్‌కు గ్రామస్థులు ఇచ్చిన ఘన స్వాగతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రావత్‌భట ప్రాంతంలోని మోహన్‌పురా గ్రామానికి చెందిన యోగేష్ చౌదరి భారత సైన్యంలో అగ్నివీర్‌గా శిక్షణ పూర్తి చేసి, తొలి విధిని విజయవంతంగా నిర్వహించాడు. అనంతరం మొదటిసారిగా స్వగ్రామానికి చేరుకోగా గ్రామస్తులు అతనికి అపూర్వ స్వాగతం పలికారు.

అగ్నివీర్‌గా ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పని చూసి 47 గ్రామాలు ఒక్కటయ్యాయి!
Agniveer Grand Welcome

Updated on: Jul 23, 2026 | 10:02 PM

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ అగ్నివీర్‌కు గ్రామస్థులు ఇచ్చిన ఘన స్వాగతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రావత్‌భట ప్రాంతంలోని మోహన్‌పురా గ్రామానికి చెందిన యోగేష్ చౌదరి భారత సైన్యంలో అగ్నివీర్‌గా శిక్షణ పూర్తి చేసి, తొలి విధిని విజయవంతంగా నిర్వహించాడు. అనంతరం మొదటిసారిగా స్వగ్రామానికి చేరుకోగా గ్రామస్తులు అతనికి అపూర్వ స్వాగతం పలికారు.

యోగేష్ చౌదరి 2025 డిసెంబర్ 27న అగ్నివీర్ పథకం కింద భారత సైన్యంలో ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం తొలి విధిని పూర్తి చేసుకుని గ్రామానికి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతనిని ఘనంగా సత్కరించారు. డీజే సంగీతం, దేశభక్తి నినాదాల మధ్య సుమారు 30 కిలోమీటర్ల మేర త్రివర్ణ యాత్ర నిర్వహించారు. యువత చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొనగా, గ్రామంలో యోగేష్‌కు తలపాగా కట్టి పూలమాలలతో సన్మానం చేశారు.

తన కుమారుడు దేశసేవలో అడుగుపెట్టిన సందర్భంగా యోగేష్ తండ్రి చతుర్భుజ్ చౌదరి ప్రత్యేకంగా 47 గ్రామాల ప్రజలకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై యోగేష్‌ను అభినందించారు. ఈ వేడుక కోసం కుటుంబం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

యోగేష్ తల్లి మధు దేవి మాట్లాడుతూ, తన కుమారుడి విజయానికి కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావమే కారణమని తెలిపారు. అతని విజయం ఇతర యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామస్తులు కూడా యోగేష్‌ను ఆదర్శంగా కొనియాడుతూ, ఇలాంటి సన్మానాలు యువతలో దేశసేవ పట్ల ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. దేశభక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us