Rajasthan Bypoll: ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. హైడ్రామా మధ్య నేడు అరెస్ట్‌! వీడియో

|

Nov 14, 2024 | 6:18 PM

రాజస్థాన్ లో బుధవారం డియోలీ-యునియారా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అయితే స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్ మీనా పోలీంగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న ఎన్నికల అధికారిని కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి..

Rajasthan Bypoll: ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. హైడ్రామా మధ్య నేడు అరెస్ట్‌! వీడియో
Rajasthan Candidate Arrest
Follow us on

జైపూర్‌, నవంబర్‌ 14: రాజస్థాన్‌లో బుధవారం జరిగిన బైపోల్ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్ మీనా బుధవారం డియోలీ సబ్‌డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్‌లో మల్పురా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అమిత్ చౌదరిని కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంరవత పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరేష్‌ మీనా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రోటోకాల్‌ను పర్యవేక్షిస్తున్న డ్యూటీలో ఉన్న SDM అమిత్ చౌదరిని కొట్టడం వీడియోలో కనిపిస్తుంది.

అనంతరం పోలీసులు నరేష్‌ మీనాను బలవంతంగా అదుపుచేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆయన మద్ధతుదారులు అక్కడికక్కడే బైఠాయించి దర్నాకు దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టి.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో మీనా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, ముగ్గురు నకిలీ ఓటర్లను ఓటేసేందుకు SDM అనుమతించాడని నరేష్‌ మీనా ఆరోపించాడు. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయిస్తున్నారని కూడా ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని అభ్యర్థి నరేష్‌ మీనా కొట్టడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎన్నికల అధికారిని కొట్టిన నరేష్‌ మీనా మాత్రం పోలీసుల ఎదుట లొంగిపోనని చెప్పాడు. పోలీసులను చుట్టుముట్టాలని తన మద్దతుదారులకు సూచించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో షీల్డ్‌లు, రక్షణ దుస్తులు, హెల్మెట్‌లు ధరించిన పోలీసులు చివరకు హైడ్రామా మధ్య ఈ రోజు నరేష్‌ మీనాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు ఆయనను చుట్టుముట్టి ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈ హైడ్రామాకు చెందిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.