Rajasthan: రాజస్థాన్‌లో మిస్టరీ వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి.. నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందాలు..

|

Apr 15, 2022 | 3:08 PM

Rajasthan: రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా పిల్లలు అంతు చిక్కని వ్యాధితో (Mysterious Disease) బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ అనుమానాస్పద వైరల్ వ్యాధితో ఏడుగురు పిల్లలు మరణించారు..

Rajasthan: రాజస్థాన్‌లో మిస్టరీ వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి.. నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందాలు..
Rajasthan
Follow us on

Rajasthan: రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా పిల్లలు అంతు చిక్కని వ్యాధితో (Mysterious Disease) బాధపడుతున్నారు. ఇప్పటికే ఈ అనుమానాస్పద వైరల్ వ్యాధితో ఏడుగురు పిల్లలు మరణించారు. ఈ దారుణ ఘటన సిరోమి జిల్లాలో జరిగింది. వెంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు సిబ్బంది.. చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సిరోహిలోని పిండ్వారా బ్లాక్‌లోని ఫులాబాయి ఖేరా గ్రామానికి జైపూర్,  జోధ్‌పూర్ నుండి  ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నట్లు రాజస్థాన్ రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు.  ప్రత్యేక బృందాలు.. సిరోమీ జిల్లాకు చేరుకుని పిల్లల మరణాలకు గల కారణాలు.. వ్యాధి గురించి పరిశోధనలు జరుపుతున్నదని తెలిపారు. ఆరోగ్య శాఖ బృందాలు గ్రామానికి చేరుకుని వ్యాధుల నిర్ధారణ కోసం నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

పిల్లల మరణాలపై సిరోహి కలెక్టర్‌ భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ.. వైరల్‌ ఎన్‌సెఫాలిటిస్‌ వల్ల పిల్లలు మరణించినట్లు వైద్య బృందం, వైద్యులు అనుమానిస్తున్నారని చెప్పారు. అయితే ఈ విషయాన్నీ నిర్ధారించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రానికి పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఆరు రోజుల్లో 10 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న ఏడుగురు పిల్లలు మరణించినట్లు.. మరింత మంది పిల్లలు ఇటువంటి బాధపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటికీ సర్వేలు నిర్వహిస్తున్నాయని అన్నారు. పిల్లలు ఫిట్స్ (మూర్ఛ, జ్వరం తో బాధపడుతున్నట్లు భన్వర్ లాల్ చెప్పారు.

Also Read:  Tirumala: తిరుమల ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి ముందు వెండి వాకిలిలో అడుగు.. దీని అర్ధం ఏమిటో తెలుసా..