మనం చేసే ఆ పనులతో.. రైల్వేకు అక్షరాల తొమ్మిదివేల కోట్ల ఆదాయం..!

| Edited By:

Feb 26, 2020 | 4:49 AM

ఇండియన్ రైల్వేస్‌కు అక్షరాల తొమ్మిదివేల కోట్ల రూపాయల ఆదాయం. అది కూడా ప్రయాణికులు రైల్లో ఝర్నీ చేయకుండానే.. నిజం. మనం టిక్కెట్లు కొన్నాక.. కొన్ని అనివార్య కారణాలతో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటాం. అప్పుడు ముందుగానే కొన్న రైల్వే టిక్కెట్లను రద్దు చేసుకుంటాం. అప్పుడు మనకు పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కట్ చేసి.. మిగతా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. అయితే.. ఇలా ప్రయాణికులు చేసిన టిక్కెట్ల రద్దు అమౌంట్.. ఏకంగా రైల్వేకి తొమ్మిది వేల కోట్ల […]

మనం చేసే ఆ పనులతో.. రైల్వేకు అక్షరాల తొమ్మిదివేల కోట్ల ఆదాయం..!
Follow us on

ఇండియన్ రైల్వేస్‌కు అక్షరాల తొమ్మిదివేల కోట్ల రూపాయల ఆదాయం. అది కూడా ప్రయాణికులు రైల్లో ఝర్నీ చేయకుండానే.. నిజం. మనం టిక్కెట్లు కొన్నాక.. కొన్ని అనివార్య కారణాలతో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటాం. అప్పుడు ముందుగానే కొన్న రైల్వే టిక్కెట్లను రద్దు చేసుకుంటాం. అప్పుడు మనకు పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కట్ చేసి.. మిగతా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. అయితే.. ఇలా ప్రయాణికులు చేసిన టిక్కెట్ల రద్దు అమౌంట్.. ఏకంగా రైల్వేకి తొమ్మిది వేల కోట్ల రూపాలయల లాభాలను తెచ్చిపెట్టింది.

గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్‌ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ.9వేల కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే సమాచార సంస్థ కేంద్రం(సీఆర్‌ఐఎస్‌)వెల్లడించింది. రాజస్థాన్‌ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్‌ స్వామి సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారంతో.. సీఆర్‌ఐఎస్‌ ఈ వివరాలను వెల్లడించింది.

జనవరి1, 2017 నుంచి జనవరి 31, 2020మధ్య.. దాదాపు మూడేళ్లలో.. తొమ్మిదిన్నర కోట్లమంది వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులు వారి టికెట్‌ రద్దు చేసుకోలేదని తెలిపారు. దీని ద్వారా రూ.4335కోట్లు ఇండియన్ రైల్వేకు ఆదాయంగా వచ్చిందని.. ఈ మధ్య కాలంలోనే టిక్కెట్లు రద్దు చేసుకోవడంతో దానికి చెల్లించే రుసుముతో మరో రూ.4684కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపింది. అయితే వీటిలో స్లీపర్‌క్లాస్‌ టికెట్ల నుంచే అధిక ఆదాయం రాగా.. తరువాతి స్థానంలో థర్డ్‌ఏసీ టికెట్లనుంచి వచ్చినట్లు పేర్కొంది.