ట్రైన్‌లో బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి.. కొట్టిచంపిన ప్రయాణికులు.. ఎక్కడంటే..

|

Sep 13, 2024 | 9:54 PM

దీంతో కోచ్‌ వద్దకు చేరకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్‌ కుమార్‌ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

ట్రైన్‌లో బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి.. కొట్టిచంపిన ప్రయాణికులు.. ఎక్కడంటే..
Railway Employee Beaten To Death
Follow us on

మహిళలు, ఆడపిల్లలపై వేధింపులు ఆగటం లేదు.. ! ఇళ్లు, ఆఫీసు, బస్సు, రైలు ఇలా ఎక్కడపడితే అక్కడ దుండగులు ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా రద్దీగా ఉండే రైలులో ప్రయాణిస్తున్న బాలిక పట్ల ఏకంగా ఓ రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి వేధింపులతో భయపడిపోయిన ఆ బాలిక వెంటనే కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్యక్తిని అక్కడే కొట్టి చంపారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. బీహార్‌లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఈ సంఘటన జరిగింది.

సమాచారం మేరకు… బీహార్‌లోని సివాన్‌కు చెందిన ఒక కుటుంబం ఈ రైలులోని థర్డ్‌ ఏసీ కోచ్‌లో బుధవారం ప్రయాణించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ కూడా అదే కోచ్‌లో ప్రయాణించాడు. ఆ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని,  వాష్‌రూమ్‌ నుంచి తిరిగి వచ్చిన తల్లిని పట్టుకుని ఆ బాలిక బోరున ఏడ్చింది. తల్లిని వాష్‌రూమ్‌ వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది.

దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. దీంతో అతడ్ని ఆ కోచ్ డోర్‌ వద్దకు తీసుకెళ్లారు. కదులుతున్న రైలులో పలు గంటలపాటు కొట్టారు. మరోవైపు గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సెంట్రల్‌ స్టేషన్‌కు ఆ రైలు చేరింది. దీంతో కోచ్‌ వద్దకు చేరకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్‌ కుమార్‌ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని వెంటనే రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ,  అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..