బుగ్గమీద కిస్.. రాహుల్ కూల్..కూల్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని తన వయనాడ్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఒకచోట ఆగగానే.. ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. ఆ వాహనంలోనుంచే ఆయన చేతిని లాగి పట్టుకుని చటుక్కున ఆయన బుగ్గపై కిస్ పెట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేరుకున్నారు. ఆ వ్యక్తిని వారించలేదు. ఇంతలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని వెనక్కి లాగేశారు. వరదల కారణంగా వయనాడ్ నియోజకవర్గంలో […]

బుగ్గమీద కిస్.. రాహుల్ కూల్..కూల్..

Updated on: Aug 28, 2019 | 4:02 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని తన వయనాడ్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఒకచోట ఆగగానే.. ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. ఆ వాహనంలోనుంచే ఆయన చేతిని లాగి పట్టుకుని చటుక్కున ఆయన బుగ్గపై కిస్ పెట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేరుకున్నారు. ఆ వ్యక్తిని వారించలేదు. ఇంతలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని వెనక్కి లాగేశారు. వరదల కారణంగా వయనాడ్ నియోజకవర్గంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాహుల్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఎంత పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ.. జనంలో కొందరు దాన్ని ఛేదించుకుని.. ఆయనకు అతి సమీపంగా వచ్చి.. కరచాలనం చేసేందుకు యత్నిస్తుంటారు. గత ఫిబ్రవరిలో గుజరాత్ లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నప్పుడు ఓ మహిళ ఇలాగే ఆయనకు చేరువగా వచ్చి.. ఆయన చెంపపై కిస్ పెట్టి తుర్రుమంది. అప్పుడు కూడా రాహుల్ కూల్..కూల్ గానే ఉన్నారు. ఇప్పుడూ దాదాపు అదే సీన్ రిపీటయింది.