అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పుచ్చకాయలు.. మరి వాటి స్పెషాలిటీ ఏంటంటే..?

|

Mar 19, 2023 | 5:18 PM

సాధారణంలో జైళ్లో ఉండే ఖైదీలను ఖాళీగా ఉంచకుండా పోలీసులు ఏదో ఒక పని చేయిస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉన్న మధురై సెంట్రల్ జైల్లో ఖైదులు రైతులుగానే మారిపోయారు.

అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పుచ్చకాయలు.. మరి వాటి స్పెషాలిటీ ఏంటంటే..?
Watermelons
Follow us on

సాధారణంలో జైళ్లో ఉండే ఖైదీలను ఖాళీగా ఉంచకుండా పోలీసులు ఏదో ఒక పని చేయిస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉన్న మధురై సెంట్రల్ జైల్లో ఖైదులు రైతులుగానే మారిపోయారు. ఈ జైలు దాదాపు 84 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో ఉండే ఖైదీలు రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తూ ఉంటారు. గత ఏడాది వేసవిలో నేలను సాగు చేసి పంటలు వేసేందుకు ఈ జైలు ఖైదీలు ఆము మలాన్ని, కూరగాయల వ్యర్థాలను కూడా వినియోగించి వివిధ రకాల కూరగాయలు, పండ్లని కూడా పండించారు. అయితే ఇప్పుడు వేసవి కాలం వస్తున్న సందర్భంగా దాదాపు వారు 400 ల పుచ్చకాయలను సాగు చేశారు. అంతేకాదు వాటిని మధురై ఉన్న ప్రిజన్ బజార్ లో కేజీకి 18 రూపాయల చొప్పున పుచ్చకాయలు అమ్ముతూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఖైదీలు సేంద్రియ పద్ధతిలోనే పుచ్చకాయలను పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో ఖైదీలు పుచ్చకాయలు పండించడంపై అక్కడి స్థానికులు. ఇప్పుడు అక్కడి జైలు అధికారులు మరికొన్ని పండ్లు, కూరగాయలు సేంద్రియ పద్ధతిలోనే పండించాలని నిర్ణయించుకున్నారు. మొదటగా అధికారులు ఖైదీలతో మిద్దె తోటలు, మొక్కలు పెంచాలని అనుకున్నారు. కానీ సేంద్రియ పద్దతిలో పండ్లు, కూరగాయలు పండిచడం వల్ల ప్రజల్లోనూ ఓ మార్పు వస్తుందని భావించి ఇలా చేశామని అధికారులు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి