పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులతో ప్రధాని మోదీ స్వయంగా టెలిఫోనిక్ ద్వారా సంభాషించారు. వీరిలో మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ ఉన్నారు. విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, తమ ప్రదర్శనలతో దేశం గర్వించేలా చేశారన్నారు. ఆటల్లో అవనీ లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. పారాలింపిక్స్‌లో ఒక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అవనీ లేఖరా ఫోన్ కాల్‌లో అందుబాటులో చేరలేకపోయారు.
భారత పారా షూటర్ అవనీ లేఖరా పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పారాలింపిక్ చరిత్రలో 3 పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా అవనీ లేఖరా నిలిచింది. అయితే బంగారు పతకం సాధించిన అవని లేఖరాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అవనీ లేఖరాఅంకితభావం భారతదేశం గర్వించేలా కొనసాగుతుంది.
ప్రతి క్రీడాకారుడి ధైర్యం, సంకల్పం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో పాల్గొనే భారత బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న బృందానికి 140 కోట్ల మంది భారతీయుల తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి క్రీడాకారుడి ధైర్యం, సంకల్పం మొత్తం దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఇక పారాలింపిక్ క్రీడలు పారిస్‌లో జరుగుతున్నాయి. దాదాపు 4,000 మందికి పైగా శారీరక, దృష్టి, మేధో వైకల్యాలున్న అథ్లెట్లు పాల్గొంటున్నారు. 11 రోజులపాటు జరగుతున్న 22 క్రీడలలో పోటీపడతున్నారు.
పారిస్ పారాలింపిక్స్ కోసం భారతదేశం ఇప్పటివరకు తన అతిపెద్ద బృందాన్ని పంపింది. ఈసారి 12 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు మొత్తం 84 మంది అథ్లెట్లను భారత్ పంపగా, అందులో 46 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు, భారతదేశం 2020 టోక్యో పారాలింపిక్స్‌కు మొత్తం 50 మంది అథ్లెట్లను మాత్రమే పంపింది. అందులో 40 మంది పురుషులు మరియు 14 మంది మహిళలు పాల్గొన్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 19 పతకాలు సాధించింది. అయితే ఈసారి రికార్డు పతకం సాధించాలని భారత్ ఆశిస్తోంది. ఈసారి భారతదేశం పారా సైక్లింగ్, పారా రోయింగ్ మరియు బ్లైండ్ జూడో అనే 3 కొత్త క్రీడలలో పాల్గొంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..