Droupadi Murmu: అంధ విద్యార్థుల గీతాలాపన.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము!

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుక్రవారం డెహ్రాడూన్‌లో పర్యటించారు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో ఆమె కొంత సమయాన్ని గడిపారు. అయితే రాష్ట్రపతి జన్మదిన సందర్భంగా.. అంధ విద్యార్థుల ఆమె కోసం ప్రత్యేకమైన పాట పాడారు. ఆ పాట విన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్నారు.

Droupadi Murmu: అంధ విద్యార్థుల గీతాలాపన.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము!
President Of India

Updated on: Jun 20, 2025 | 5:02 PM

మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం డెహ్రాడూన్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శుక్రవారం తన జన్మదినం సందర్భంగా ఆమె డెహ్రాడూన్‌లోని జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో కొంత సమయాన్ని గడిపారు. అక్కడి అంద విద్యార్థులతో సరదాగా కొద్ది సేపు సంభాషించారు. అయితే రాష్ట్రపతి రాకతో అక్కడికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇవాళ రాష్ట్రపతి ముర్ము పుట్టినరోజు కావడంతో.. ఆ సంస్థ విద్యార్థులు ద్రౌపతి ముర్ము కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థుల పాట పాడుతూ ఓ ప్రదర్శన చేశారు. ఈ విద్యార్థుల ప్రదర్శన చూసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగానికి గురయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరత్‌ అవుతోంది. ఈ వీడియోలో.. రాష్ట్రపతి ముర్ము వేదికపై కూర్చుని ఉండగా.. అక్కడున్న అంధ విద్యార్థులు ఆమె కోసం ఓ పాటను పాడుతూ ప్రదర్శన చేశారు. ఆ విద్యార్థులు పాడిన పాట, వారి ప్రదర్శన చూసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మము ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఏకంగా వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. నా ప్రజా జీవితంలో హృదయాన్ని హత్తుకునే క్షణాల్లో ఇది కూడా ఒకటి అని ఆమె అన్నారు. కల్మషం లేని ఆ చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి దేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతో పాటు, డెహ్రాడూన్ ముఖ్యమంత్రి ధామి, గవర్నర్ గుర్మీత్ సింగ్ కూడా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..