Rahul Karnataka visit: కర్నాటకలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. రాహుల్‌గాంధీ శ్రీసిద్ధగంగా టూర్ అందుకేనా?

|

Mar 31, 2022 | 8:55 PM

ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో కర్నాటకలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ. లింగాయత్‌ సామాజిక వర్గాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా రాహుల్‌ సిద్దగంగా మఠాన్ని సందర్శించారు.

Rahul Karnataka visit: కర్నాటకలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. రాహుల్‌గాంధీ శ్రీసిద్ధగంగా టూర్ అందుకేనా?
Ahul Gandhi Visit Siddaganga Mutt
Follow us on

Rahul Karnataka visit: ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో కర్నాటక(Karnataka)లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi). లింగాయత్‌ సామాజిక వర్గాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా రాహుల్‌ సిద్దగంగా మఠాన్ని సందర్శించారు. కర్నాటకలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఊపందుకుంది. హిజాబ్‌ వివాదంతో పాటు తాజాగా హలాల్‌ వివాదం తెరపైకి రావడంతో ఎన్నికల హీట్‌ పెరిగింది. ఎన్నికల కోసమే ఈ వివాదాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల పుకార్లతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్నాటకపై దృష్టి పెట్టింది. రాహుల్‌గాంధీ కర్నాటకలో పర్యటిస్తున్నారు

తుమ్‌కూరులోని శ్రీసిద్ధగంగా మఠాన్ని సందర్శించి, మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు రాహుల్‌గాంధీ. సిద్దగంగా మఠానికి కర్నాటక రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. లింగాయత్‌ సామాజిక వర్గానికి ఈ మఠం రాజధాని లాంటిది. మఠం ఎలా ఆదేశిస్తే లింగాయత్‌ ఓటుబ్యాంక్‌ అటువైపు వెళ్తుంది. అందుకే రాహుల్‌గాందీ ఈ మఠాన్ని సందర్శించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌టంతో కాషాయ పార్టీపై వ్య‌తిరేక‌త ఆస‌రాగా జ‌నంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక‌లు రచిస్తోంది.

మఠాధిపతులు సాదరంగా రాహుల్‌ను సిద్దగంగా మఠం లోకి ఆహ్వానించారు. మఠంలో పూజలు చేశారు రాహుల్‌. మఠం లోని విద్యార్ధులతో కలిసి సామూహిక ప్రార్ధనలో పాల్గొన్నారు. లింగాయ‌త్‌ల ఓట్ల కోసం రాహుల్ గాంధీ స్వ‌యంగా రంగంలోకి దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధ‌గంగ మ‌ఠం పర్యటన కంటే ముందే రాహుల్ ఇక్క‌డ‌కు రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలావుంటే, లింగాయ‌త్‌ల జ‌నాభా అధికంగా ఉండ‌టంతో క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో ఈ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునేందుకు రాజ‌కీయ పార్టీలు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తుంటాయి. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ సంక్షేమ ప‌ధ‌కాల‌తో కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Read Also….  Afghanistan: గెడ్డంతో వస్తేనే గవర్నమెంటు ఆఫీసుల్లోకి ఎంట్రీ.. లేదంటే గెటౌట్.. ఇదేం పైత్యం సామి..