హ్యాట్సాఫ్.. ఓ వైపు ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే పిల్లాడిని రక్షించిన జవాన్..

ఓ వైపు ఉగ్రవాదుల నుంచి తుపాకీ గుండ్లు మీదికి వస్తుంటే.. ఎవరైనా సరే భయపడక తప్పదు. ఆ సమయంలో ఇతరులను కాపాడుదామన్న ఆలోచన కూడా రాదు. కానీ మన

హ్యాట్సాఫ్.. ఓ వైపు ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే పిల్లాడిని రక్షించిన జవాన్..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 12:29 PM

ఓ వైపు ఉగ్రవాదుల నుంచి తుపాకీ గుండ్లు మీదికి వస్తుంటే.. ఎవరైనా సరే భయపడక తప్పదు. ఆ సమయంలో ఇతరులను కాపాడుదామన్న ఆలోచన కూడా రాదు. కానీ మన భారత జవాన్ల తీరు చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బుధవారం జరిగిన ఘటనలో ఓ బాలుడిని భారత జవాన్‌ కాపాడిన తీరు చూస్తే మన భారత ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిందే. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం సోపోర్‌లో సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌తో పాటు మరో పౌరుడు కూడా మరణించాడు. అయితే ఈ ఘటనలో మరణించిన పౌరుడితో పాటు ఓ మూడేళ్ల పిల్లాడు వెంట వచ్చాడు. అయితే ఉగ్రవాదులు తుపాకుల తూటల పేలుళ్లకు ఆ బాలుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అది గమనించిన ఓ జవాన్.. ఉగ్రవాదుల తూటల మధ్యనే ఆ పిల్లాడిని కాపాడాడు. ఆ పిల్లాడికి తూటాలు తగలకుండా.. జవాన్‌ రక్షణ కవచంగా నిలిచాడు. ఆ తర్వాత ఆ బాలుడిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చేరవేశారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Latest Articles