Chennai: ప్రియురాలిని రైలు కింద తోసేసిన ఘటనలో షాకింగ్ విషయాలు.. కూతురు మర్డర్ తట్టుకోలేక తండ్రి సూసైడ్

|

Oct 14, 2022 | 11:24 PM

ప్రేమను ఒప్పుకోలేదని ప్రియురాలిని రైలు కింద తోసేసిన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కూతురు హత్యకు గురైందన్న వార్త విని తండ్రి తట్టకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో విషం తాగి సూసైడ్..

Chennai: ప్రియురాలిని రైలు కింద తోసేసిన ఘటనలో షాకింగ్ విషయాలు.. కూతురు మర్డర్ తట్టుకోలేక తండ్రి సూసైడ్
mothers dead body
Follow us on

ప్రేమను ఒప్పుకోలేదని ప్రియురాలిని రైలు కింద తోసేసిన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కూతురు హత్యకు గురైందన్న వార్త విని తండ్రి తట్టకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఆమె తల్లి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా.. కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె లీవ్ లో ఉంది. కుమార్తె సత్య, భర్త మాణిక్యం మరణంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. కాగా.. సత్యను కిరాతకంగా హత్య చేసిన సతీశ్​ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ స్వయంగా మృతురాలి ఇంటికి వెళ్లారు. క్యాన్సర్ తో బాధపడుతున్న రామలక్ష్మిని పరామర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాగా.. చెన్నైలోని టీ టీనగర్​లో నివాసముండే ఓ యువతి.. స్థానిక ప్రైవేట్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఆదంబాక్కంకు చెందిన సతీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే అతడిని కేవలం స్నేహితుడిగానే యువతి భావించింది. కానీ సతీశ్ మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. తనను ప్రేమించాలని వేధించాడు. యువతి అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ సమయంలో యువతి ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లేందుకు పరింగిమలై రైల్వే స్టేషన్​లో రైలు కోసం ఎదురు చూస్తోంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు అక్కడికి వచ్చిన సతీశ్ ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర కోపంలో ఎదురుగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఊహించని ఈ ఘటనతో బాధితురాలు రైలు కింద పడి చనిపోయింది. సతీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సతీశ్ ను అరెస్టు చేశారు.