PM Modi: మరాఠ డోలు వాయించిన ప్రధాని మోదీ.. నాగ్‌పూర్ పర్యటనలో సాంప్రదాయ స్వాగతం..

|

Dec 11, 2022 | 12:40 PM

ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంప్రదాయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డోలు వాయించారు. ప్రధాన మంత్రి నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

PM Modi: మరాఠ డోలు వాయించిన ప్రధాని మోదీ.. నాగ్‌పూర్ పర్యటనలో సాంప్రదాయ స్వాగతం..
Pm Narendra Modi Tries His Hands At 'dhol'
Follow us on

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరాఠాల సంప్రదాయ వాయిదాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు స్థానిక యువకులు. అయితే స్వాగత వేడుకలో డోలు వాయిద్యకారులు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. ఆ యువకులు వాయించే పద్దతి నచ్చడంతో ప్రధాని మోదీ కూడా వారితో కలిసిపోయారు. డోలు వాయిద్యకారుల మధ్యలకి ప్రధాని మోదీ రావడంతో వాయిద్యకారులు ఉత్సాహంగా డప్పులు మోగించారు. ప్రధాని మోదీ కూడా వారితో కలిసి డ్రమ్స్ వాయించారు. సరిగ్గా వాయిద్యకారుల సమానంగా ప్రధాని మోదీ వాయించడం అక్కడే ఉన్నవారికి ఉత్సాహన్ని నింపింది. అయితే 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇందులో ప్రధానమంత్రి డ్రమ్ వాయించడం చూడవచ్చు..

దేశంలో ఆరో వందే భారత్‌ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ల మధ్య సేవలందించే ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. ప్రయాణికులు, రైల్వే సిబ్బందితో ముచ్చటించారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ.. నాగ్‌పూర్‌కు చేరుకున్నారు.

ఇండియాలో హైవేలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే ఆదివారం ప్రధాని మోదీ.. నాగపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే లోని మొదటి దశను ప్రారంభిస్తారు. మొత్తం 701 కి.మీ వేలో మొదటి దశ 520 కి.మీ ఉంది. సమృద్ధి మహా మార్గంగా పిలుస్తున్న ఈ హైవే.. నాగపూర్ – షిర్డీలను కలుపుతుంది.

దేశవ్యాప్తంగా హైవేలతో కనెక్టివిటీ పెరగాలనుకుంటున్న ప్రధానమంత్రి కలల ప్రాజెక్ట్ ఇది. దీన్ని నాగపూర్ – ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. మొత్తం 701 కి.మీ ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వే.. దేశంలోని అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వేలలో ఒకటిగా నిలవనుంది. రూ.55వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి.. మహారాష్ట్రలోని 10 జిల్లాల్లో వెళ్తుంది. అర్బన్ ఏరియాలైన అమరావతి, ఔరంగాబాద్, నాసిక్ గుండా ఇది సాగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం