తెలంగాణ ప్రచారంలో బిజీబిజీగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో తిరుపతికి వెళ్లనున్నారు. దీంతో .ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు భద్రతా సిబ్బంది. కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. వీఐపీలు బస చేసే అతిథి గృహాలను NSG బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
తిరుపతి, తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు మోదీ. రాత్రి తిరుమలలోనే బస చేసి, సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసింది. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.ఇప్పుడు నాలుగోసారి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు మోదీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…