Narendra Modi: నేడు ఈ తొలి ఏడాది మన్‌ కీ బాత్‌.. మరికాసేపట్లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈ ఏడాదిలో తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మోదీ మన్‌ కీ బాత్‌ 73వ ఎపిసోడ్..

Narendra Modi: నేడు ఈ తొలి ఏడాది మన్‌ కీ బాత్‌.. మరికాసేపట్లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Narendra Modi

Edited By:

Updated on: Jan 31, 2021 | 11:05 AM

2021s First Mann Ki Baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈ ఏడాదిలో తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మోదీ మన్‌ కీ బాత్‌ 73వ ఎపిసోడ్‌ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్‌లో 2021-22 బడ్జెట్‌ ప్రవేశ పెట్టే ముందు రోజు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మన్ కీ బాత్ కార్యక్రమంపై ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రధాని పలు విషయాలను వెల్లడించే అవకాశముంది.

ప్రధాని మోదీ గతేడాది చివరి ఎపిసోడ్‌లో భారతదేశం తయారు చేసిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని, వాటిని అందరూ ఆదరించాలని కోరారు. ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ నినాదానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో దేశ పురోభివృద్ధికి పలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలంతా తమ దైనందిన జీవితంలో మరిన్ని స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలని, ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిద్దాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

Also Read:

Budget 2021: ఏ పన్ను విధానం మంచిది.. కొత్తదా? పాతదా? ఈసారి ఏం మారనుంది..

Railway Budget 2021: రేపు కేంద్ర బడ్జెట్‌.. ప్రైవేటు రైళ్ల కూత.. కొత్త రైళ్లపై ప్రత్యేక దృష్టి