PM Modi: జ‌న సంక్షేమ‌మే కళ్యాణ్ సింగ్ జీవిత మంత్రం.. యూపీ మాజీ సీఎంకు ప్రధాని మోడీ నివాళులు

శ‌నివారం క‌న్నుమూసిన‌ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్ (89) భౌతిక‌కాయానికి ప్రధాని న‌రేంద్ర మోడీ నివాళుల‌ర్పించారు.

PM Modi: జ‌న సంక్షేమ‌మే కళ్యాణ్ సింగ్ జీవిత మంత్రం.. యూపీ మాజీ సీఎంకు ప్రధాని మోడీ నివాళులు
Pm Modi Tributes Kalyan Singh
Follow us

|

Updated on: Aug 22, 2021 | 4:58 PM

PM Modi Tributes Kalyan Singh: శ‌నివారం క‌న్నుమూసిన‌ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్ (89) భౌతిక‌కాయానికి ప్రధాని న‌రేంద్ర మోడీ నివాళుల‌ర్పించారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న ప్రధాని మోడీ.. కల్యాణ్‌ సింగ్‌ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు లక్నో చేరుకున్న ప్రధానికి మోడీకి.. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడైన కల్యాణ్‌ సింగ్‌ శనివారం రాత్రి కన్నుమూశారు. క‌ళ్యాణ్‌సింగ్ జ‌న సంక్షేమాన్నే త‌న జీవిత మంత్రంగా చేసుకున్నారు. ఆయ‌న యూపీతోపాటు దేశ అభివృద్ధికి పాటుప‌డ్డారని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, మంచి పాల‌న‌తో పేరు సంపాదించారు అని మోడీ ఈ సంద‌ర్భంగా అన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్‌ సింగ్ శనివారం కన్నుమూశారు.. జూలై 4 నుంచి లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆసుపత్రి లో చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్‌ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్‌జీపీజీఐ తెలిపింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దశలో సీఎంగా పనిచేశారు కళ్యాణ్‌ సింగ్.. యూపీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారాయన.. ముందుగా 1991 జూన్ నుంచి 1992 వరకూ, ఆ తర్వాత 1997 సెప్టెంబర్ నుంచి నవంబర్ 99 వరకూ సీఎంగా పనిచేశారు. 1992లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటు చేసుకుంది. Read Also… Powerful Women: పద్మజ.! బ్యాంకింగ్‌నేకాదు, ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన దీశాలి

పెంపుడు కుక్కకు ఉన్న విశ్వాసం కన్నకొడుకుకు లేకపోయింది.. తల్లిని ఈడ్చిపడేసిన కుమారుడిని శునకం ఎంచేసిందంటే?