PM Narendra Modi: 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు

|

May 17, 2022 | 3:31 PM

PM Modi inaugurates 5G testbed: టెలికాం రంగంలో క్లిష్టమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ-విశ్వాసం దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధానమైన సిబ్బందికి, IITలకు మోడీ అభినందనలు తెలియజేశారు.

PM Narendra Modi: 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు
Pm Modi
Follow us on

PM Modi inaugurates 5G testbed: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు. TRAI సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా మంగళవారం ప్రధాని మోడీ 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రజతోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఇది దేశంలోని టెలికాం పరిశ్రమ .. స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు ఐదవ తరంలో ఉత్పత్తులు, నమూనాలు .. పరిష్కారాలను ధృవీకరిస్తుందన్నారు. స్వీయ-నిర్మిత 5G టెస్ట్ బెడ్‌ను దేశానికి అంకితం చేసే అవకాశం తనకు లభించడం గర్వకారణమన్నారు. టెలికాం రంగంలో క్లిష్టమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ-విశ్వాసం దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధానమైన సిబ్బందికి, IITలకు మోడీ అభినందనలు తెలియజేశారు.

క్లిష్టమైన, ఆధునిక సాంకేతికతల దిశలో స్వావలంబన కోసం 5G టెస్ట్‌బెడ్ ఒక ముఖ్యమైన దశ అని మోడీ అభివర్ణించారు. 5G టెక్నాలజీని తయారు చేసేందుకు టెస్టింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మోడీ యువకులు, పరిశోధకులు, కంపెనీలకు సూచించారు. స్టార్టప్‌లు, పరిశ్రమలు తమ ఉత్పత్తులను స్థానికంగా పరీక్షించడానికి.. ధృవీకరించడానికి అదేవిధంగా విదేశీ సౌకర్యాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశంలోని మొదటి 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించడం జరిగింది.

8 ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా..

ఇవి కూడా చదవండి

8 ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా.. 5G టెస్ట్‌బెడ్‌ను అభివృద్ధి చేశాయి. మొత్తం 8 ఇన్‌స్టిట్యూట్‌లు కలిసి దీనిని అభివృద్ధి చేశాయి. ఐఐటీ మద్రాస్ నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో IIT ఢిల్లీ, IIT హైదరాబాద్, IIT బాంబే, IIT కాన్పూర్, IISc బెంగళూరు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ (CEWiT) ఉన్నాయి.

220 కోట్లతో.. 

ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి 220 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ టెస్ట్‌బెడ్ భారతీయ పరిశ్రమ స్టార్టప్‌లకు సహాయక పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది.

5G టెస్ట్‌బెడ్ అంటే ఏమిటి?

5G టెస్ట్‌బెడ్ భారతీయ పరిశ్రమ .. స్టార్టప్‌లకు సహాయక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది. 5G తదుపరి తరం సాంకేతికతలలో వారి ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలకు అనుమతిస్తుంది.