Donate Pension: త్వరలో ప్రధాని మోడీ మరో కీలక విజ్ఞప్తి.. పింఛన్ల విరాళాలకు పిలుపు..!

Donate Pension: దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీని వదులకోవాలని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మంచి ఫలితాలు ఇచ్చింది. అప్పుడు..

Donate Pension: త్వరలో ప్రధాని మోడీ మరో కీలక విజ్ఞప్తి.. పింఛన్ల విరాళాలకు పిలుపు..!
Follow us

|

Updated on: Nov 30, 2021 | 11:41 AM

Donate Pension: దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీని వదులకోవాలని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మంచి ఫలితాలు ఇచ్చింది. అప్పుడు అదే స్ఫూర్తితో మరో విజ్ఞప్తిని చేయనున్నారు మోడీ. పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో పని చేస్తున్న పేద వృద్ధ కార్మికుల కోసం త్యాగం చేయాలని మోడీ త్వరలో కోరనున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేసి గణనీయ మొత్తంలో పెన్షన్‌ పొందుతున్న సంఘటిత రంగ సిబ్బంది ఏటా కనీసం రూ.36 వేలను విరాళంగా అందించాలని మోడీ ప్రభుత్వం అభ్యర్థించనుంది. ఈ మొత్తాన్ని అసంఘటిత రంగంలో 60 ఏళ్లుపైబడిన వారికి తలా రూ.3వేల చొప్పున పంపణీ చేయాలని నిర్ణయించింది మోడీ సర్కార్‌.

ఈ కొత్త ప్రతిపాదనకు ‘పింఛన్‌ విరాళం’ అని పేరు పెట్టారు. దీనిని త్వరలో ప్రకటించనున్నారు ప్రధాని మోడీ. లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు 2018లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పెన్షన్‌ జమ చేస్తోంది. కార్మికులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నుంచి నెలకు రూ.3వేల చొప్పున పింఛన్‌ అందుతుంది.

18-40 ఏళ్ల వయసున్న వారి నెల సంపాదన రూ.15 వేలు కన్న తక్కువ ఉన్న అసంఘటిత కార్మికులు ఈ స్వచ్ఛంద ఫించన్‌ పథకానికి అర్హులు. భారతదేశంలో 38 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులున్నప్పటికీ ఈ సంవత్సరం అక్టోబర్‌ వరకు 45.1 లక్షల మంది మాత్రమే ఈ స్కీమ్‌లో చేరారు. మిగిలిన వారికి 60 ఏళ్ల తర్వాత ఎటువంటి సామాజిక భద్రతా లేదు. ఈ నేపథ్యంలో పింఛన్‌ విరాళం కింద ఆదుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఎలాంటి నేరం చేయకుండానే జైల్లో 43 ఏళ్లు.. చివరికి నిర్ధోషిగా జైలు నుంచి విడుదల

EPF Customers Alert: ఖాతాదారులు అలర్ట్‌.. నేటితో గడువు ముగింపు.. ఆధార్‌ లింక్‌ చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయి..!

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?