దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా రాసిన ‘గర్బా’ పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దసరా నవరాత్రి సందర్భంగా గర్బా నృత్యంపై ప్రత్యేక పాట రాశారు..ప్రధాని మోదీ. ప్రధాని రాసిన గీతాన్ని.. గాయని పూర్వా మంత్రి ఆలపించారు. తన అధికారిక ఎక్స్‌ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు ప్రధాని. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ “అవటికలయ” అనే గర్బా పాటను రచించానన్న ప్రధాని.. ప్రజలందరిపైనా ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. గతేడాది కూడా శరన్నవరాత్రుల వేళ గర్బాపై ప్రత్యేకమైన కవితను రాశారు..ప్రధాని మోదీ.
ఈ పాటను పాడిన గాయకుai పూర్వ మంత్రికి కూడా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో, గాయకుల ప్రతిభను కూడా ప్రశంసించారు. చైత్ర, శారదియ నవరాత్రులలో, ప్రధాని మోదీ 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు.ఈ సమయంలో ప్రధాని మోదీ పగటిపూట నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు. రాత్రిపూట ఒకసారి పండ్లు తింటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..