అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్.. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పురోగతి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు సమాచారం. భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రతా రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ప్రధాని మోదీ - ట్రంప్ చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్.. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పురోగతి!
Pm Narendra Modi, Donald Trump

Updated on: Dec 11, 2025 | 8:08 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు సమాచారం. భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రతా రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ప్రధాని మోదీ – ట్రంప్ చర్చించారు. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదిలావుంటే, రష్యా అధ్యక్షు పుతిన్‌ భారత పర్యటన అనంతరం.. ట్రంప్‌- మోదీ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..