
ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ అద్భుతమైన, సుందర దృశ్యాలను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయితున్నారు. మోదీ షేర్ చేసిన ఆ వీడియోలో ఓ ఆలయంపై వర్షం కురుస్తుండగా…ఆ నీరంతా గుడి మెట్లపై పారుతూ..ఎంతో మనోహారంగా కనిపిస్తోంది. పాల సముద్రం పైకెగిసిందా అన్నంత అపురూపంగా అక్కడి జలదృశ్యం కనువిందు చేస్తోంది. అది గుజరాత్ లోని సూర్యదేవాలయంలో గల సూర్యకుండ్ దృశ్యాలు.
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day ?!
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
— Narendra Modi (@narendramodi) August 26, 2020
ఇకపోతే, ఈ సూర్యదేవాలయం గుజరాత్ లోని మహసానా జిల్లాలో గలదు. సోలంకి రాజైన రెండవ భీందేవ్ క్రీ.శ. 11 వశతాబ్దములో సూర్యదేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇది చోళరాజుల కాలం నాటిది. కనుచూపమేరలో కొండగానీ, రాయిగానీ లేనిచోట కొన్ని మైళ్ళ నుంచి రాయిని తొలచి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిపునాదులు వేయించి రాయిని దూలాలు, స్తంభాలు, మూర్తులుగా చిత్రికరించారట. ఎక్కడా సున్నంతో టాకీ వెయ్యకుండా రాయిలో రాయి అమర్చి నిర్మించిన ఒక అద్భుతమైన రాతిదేవాలయముగా ఇక్కడి సూర్య దేవాలయం ప్రసిద్ధి.
ఇక్కడి ఆలయ నిర్మాణం మూడు విధములుగా కనిపిస్తుంది అవి: