
మీరు, లేదా మీ పూర్వీకులు.. బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో మర్చిపోయిన, మిగిలిపోయిన సొత్తు మీకు దక్కే ఛాన్స్‌ను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్రం ఇటీవల ఈ డబ్బులు తీసుకునేందుకు సులువైన వెసులుబాటు కల్పించింది. సదరు నగదుకు మీరు హక్కుదారులు, వారసులైతే, బ్యాంకుల్లో నిరూపయోగంగా ఉన్న సొమ్ములు చాలా సులభంగా తీసుకుకొచ్చారు.
భారతీయ పౌరుల 78 వేల కోట్ల రూపాయలు దేశ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి. బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారులు ఎవరు ఉన్నారో, సొమ్ము ఎవరిదో, ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అదేవిధంగా, బీమా కంపెనీల వద్ద దాదాపు 14 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల వద్ద దాదాపు 3 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. 9 వేల కోట్ల రూపాయల డివిడెండ్ అక్కడ ఉంది. ఇదంతా క్లెయిమ్ చేయకుండా పడి ఉంది. ఎవరూ దాని యజమాని కాదు. మన ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా వాటి హక్కుదారుల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా కోరారు.
Here is a chance to convert a forgotten financial asset into a new opportunity.
Take part in the ‘Your Money, Your Right’ movement! https://t.co/4Td6wyz99i@LinkedIn
— Narendra Modi (@narendramodi) December 10, 2025
ఇదిలావుంటే మంగళవారం (డిసెంబర్ 9), ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. బ్యాంకు ఖాతాలు, బీమా, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్లలో జమ చేయని, క్లెయిమ్ చేయని డబ్బుతో సహా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను వారి చట్టబద్ధమైన హక్కుదారులకు బదిలీ చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన “మీ మూలధనం, మీ హక్కులు” ప్రచారం ఇప్పటివరకు 477 జిల్లాలకు చేరుకుందని చెప్పారు. “అక్టోబర్ 4, 2025న ప్రారంభించబడిన ఈ ప్రచారం 3A ఫ్రేమ్‌వర్క్ – అవగాహన, యాక్సెస్, చర్య ఆధారంగా రూపొందించింది. ఈ మూడు నెలలల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయడం జరుగుతుంది.” అని అన్నారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో RBI, SEBI, IRDAI, PFRDA, IEPFA వంటి ఆర్థిక రంగంలోని అన్ని ప్రధాన నిధి నియంత్రణ సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. RBI అధ్వర్యంలో UDGAM (అన్‌క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్ల కోసం), IRDAI బీమా భరోసా (అన్‌క్లెయిమ్డ్ బీమా ఆదాయాల కోసం), SEBI వారి MITRA (అన్‌క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్ల కోసం) వంటి ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌లు పౌరులు తమ అన్‌క్లెయిమ్డ్ ఆస్తులను గుర్తించడంలో సహాయపడటంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..