Narendra Modi: మోదీకి తెలుగంటే మక్కువా? గురజాడ పంక్తులనెందుకు కోట్ చేశారు? తెలుగుతో నరేంద్రుని అనుబంధం

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడటమే కాదు తెలుగు పద్యాలు, జాతీయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలో చాలా సార్లు తెలుగు...

  • Subhash Goud
  • Publish Date - 6:08 pm, Sat, 16 January 21
Narendra Modi: మోదీకి తెలుగంటే మక్కువా? గురజాడ పంక్తులనెందుకు కోట్ చేశారు? తెలుగుతో నరేంద్రుని అనుబంధం

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో మాట్లాడటమే కాదు తెలుగు పద్యాలు, జాతీయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలో చాలా సార్లు తెలుగు నేలపై అడుగు పెట్టిన సందర్భంలో మోదీ కొద్ది సేపు తెలుగులో మాట్లాడేవాళ్లు. రాసుకుని వచ్చినవి అయినా తెలుగు ప్రజల వద్దకు వచ్చి మాృత భాషను గుర్తు చేస్తూ మోదీ చేసిన ప్రసంగాలకు ప్రశంసల జల్లు కురిసేది. అలాంటిది ఇప్పుడు మోదీ ఏకంగా మన మహాకవి గురజాడ అప్పారావు రాసిన పద్యాలను కరోనా టీకాలు ఇచ్చే సందర్భంగా ప్రస్తావించడం ఆసక్తికర అంశంగా మారింది. గతంలో మోదీ ఎప్పుడెప్పుడు తెలుగు ప్రస్తావన చేశారు. ఏ సందర్భంలో ఎక్కడ, ఏం మాట్లాడారో చూద్దాం…

ఆగస్టు 12, 2013 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మోదీ తెలుగు మాటలు

సోదర, సోదరీ మణులారా హైదరాబాద్ ప్రజలారా… భారతదేశం ప్రగతికి తెలుగు వారి కృషి ప్రశంసనీయం. తెలుగు ప్రజలు సుఖ, సంతోషాలతో శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆ శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి త్వరగా బయటకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. గుజరాత్ లో తెలుగు మీడియంను ప్రొత్సాహించాను.

2018 డిసెంబర్3న..

హైదరాబాద్ లోని ఎల్బీ స్డేడియంలో జరిగిన నవభారత్- యువభేరిలో ప్రజలనుద్దేశించి మోదీ. ఎందరో అమర వీరులు కన్న కలల సాకారం కోసం.. మార్పు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఆశలతో వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు వందనాలు అంటూ ప్రసంగించిన మోదీ.

హైదరాబాద్ అంటే నాకు ఎంతో ఇష్టం.. అలాగే, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాకు ఎంతో ఆదర్శం. పటేల్ పట్టుదల వల్లే హైదరాబాద్‌కు విమోచనం కలిగింది. హైదరాబాద్ అనగానే నాకు వెంటనే పటేల్ గుర్తుకొస్తారు. సర్దార్ పటేల్ లేకపోతే ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఉండేది కాదు. తెలంగాణలో మీతో ఆనందంగా మాట్లాడే అవకాశం నాకు కలిగేదే కాదు. హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన తెలుగు ప్రజలందరికీ నా అభినందనలంటూ మోదీ తెలుగులో మాట్లాడారు.

2019 ఫిబ్రవరిలో 10న..

గుంటూరులో జరిగిన బీజేపీ ప్రజా చైతన్యసభలో తెలుగులో మాట్లాడిన మోదీ.. ‘అక్షర క్రమంలోనే కాదు, అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్‌, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నా నమస్కారం. మహా కవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం అంటూ మోదీ ప్రసంగించారు.

2019 మార్చి1న..

ప్రియమైన సోదరీ సోదరీమణులారా… అందమైన విశాఖను చూస్తే మనసు పులకరించిపోతోంది. శ్రీ వరాహా లక్ష్మీ నరసింహ స్వామి అవతరించిన పుణ్యభూమి ఇది. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతమిది. తెన్నేటి విశ్వనాధం వంటి మహనీయుడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. పర్యాటకంగా, దేశాభివృద్ధిలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం.. అంటూ తెలుగులో ప్రసంగించారు.

2019 సెప్టెంబర్ 22న..

అమెరికాలోని హుస్టన్ సభలో మోదీ తెలుగులో మాట్లాడారు. అంతా బాగుంది అంటూ తెలుగువారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు మోదీ.

22021 జనవరి 16న..

కోవిడ్‌ టీకా వేసే కార్యక్రమంలో మోదీ తెలుగు పద్యం ప్రస్తావన తీసుకువచ్చారు. ‘సొంత లాభం కొంత మానుకొని, తోడివాడికి సాయపడవోయ్. దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ అప్పారావు వారి పద్యాన్ని గుర్తు చేశారు మోదీ. తద్వారా దేశ ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని సూచించారు.
ఇలా ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగించడం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మన భాష రాకున్నా.. తెలుగులో మాట్లాడి అందరి మన్ననలు పొందుతున్నారు. ఇలా అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడటంతో ప్రతి ఒక్కరు మోదీకి ఫిదా అయిపోతున్నారు.

Also Read:

Navalben: పాలను అమ్మి రూ.1.10 కోట్లు సంపాదించింది.. రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో మహిళ ‘నవల్‌బెన్‌’

రూమర్లను నమ్మకండి, కోవిడ్ పై పోరాటం ఆరంభమైంది, మానవాళి కోసం ప్రాణాలు అర్పించినవారికిదే నివాళి, మోదీ