
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిహార్ చేరుకున్నారు. ఈరోజు ఆయన మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఇక్కడకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదట పహల్గామ్‌లో మరణించిన వారికి నివాళులు అర్పించి, ఆ తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దేశం దుఃఖంలో ఉంది. ఈ దాడి పర్యాటకుల పై దాడి కాదు దేశంపై దాడి. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను, దాని వెనుక ఉన్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుంది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియజేస్తున్నా ఉగ్రవాదులను వదిలి పెట్టం. న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. భారత్ కు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు అని ప్రధాని మోదీ అన్నారు.
ఆ తర్వాత బిహార్లో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. వివాదాల పరిష్కారంలో భూమి పత్రాల డిజిటలైజేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. స్వతంత్రం తర్వాత దేశానికి కొత్త పార్లమెంట్ భవనం వచ్చిందని, 30 వేల కొత్త పంచాయతీ భవనాలు కూడా నిర్మించినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత, ఇది గ్రామాల అభివృద్ధికి దారితీసిందని అన్నారు. అంతకంటే ముందు.. ప్రధాని మోదీకి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ తర్వాత సీఎం నితీష్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని సీఎం నితీష్ కుమార్ అన్నారు. ప్రగతి యాత్ర ద్వారా ఇటీవల బిహార్‌లో జరిగిన పనులను పరిశీలించామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో బిహార్‌లో అనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రోడ్డు పథకం, వరద నియంత్రణ, ఆరోగ్యం కోసం పెద్ద ప్రకటనలు చేసింది. మఖానా బోర్డును ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీ గురించి వ్యాఖ్యానిస్తూ, అది చాలా గందరగోళంగా మారిందని, మనం ఎప్పటికీ దానితో ముందుకు సాగలేమని సీఎం నితీష్ అన్నారు. అనంతరం బిహార్‌లో రూ.869 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలకు ఇళ్ల తాళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందజేశారు.
#WATCH | On Pahalgam terror attack, PM Modi says, “Today, on the soil of Bihar, I say to the whole world, India will identify, trace and punish every terrorist and their backers. We will pursue them to the ends of the Earth. India’s spirit will never be broken by terrorism.… pic.twitter.com/8SPHOAJIi2
— ANI (@ANI) April 24, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..