PM Modi : ఈశాన్య భారత్‌లో చారిత్రక ఘట్టం.. ఈఎల్‌ఎఫ్‌పై ల్యాండైన మోదీ విమానం!

అస్సాం పర్యటనలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ పై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఫోర్స్ విమానం (C-130J) విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

PM Modi : ఈశాన్య భారత్‌లో చారిత్రక ఘట్టం.. ఈఎల్‌ఎఫ్‌పై ల్యాండైన మోదీ విమానం!
Emergency Landing Facility Northeast India

Updated on: Feb 14, 2026 | 12:41 PM

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఈశాన్య భారతంలో నిర్మితమైన మొదటి అత్యవసర ల్యాండింగ్ కేంద్రం డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)పై ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్ట్ విమానం ల్యాండ్ అయింది. అత్యవసర సమయాల్లో సైనిక విమానాలు, పౌర విమానాలు భూమిపై దిగడానికీ, నేల మీది నుంచి నింగి లోకి ఎగురడానికీ ఈ ఈఎల్ఎఫ్ ను భారత వాయు సేన సమన్వయంతో నిర్మించారు. ఇది అత్యవసర సేవలను అందించడంలో ఎంతో కీలక పాత్రను పోషింనుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఈఎల్‌ఎఫ్ చాలా కీలకమని, సవాలుతో కూడిన పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను సకాలంలో మోహరించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మోరన్ బైపాస్‌లో రూ.100 కోట్లతో 4.2 కి.మీ మేర నిర్మించిన ఈ ELF ఈ స్ట్రెచ్ IAF ఫైటర్ జెట్‌లు, రవాణా విమానాలకు వ్యూహాత్మక, బహుళ-ఫంక్షనల్ రన్‌వేగా ఉపయోగపడుతుంది.

వీడియో చూడండి..

ఈశాన్య ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఆ ప్రాంతాల్లో వ్యూహాత్మక అవసరాల్ని తీర్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఈఎల్ఎఫ్‌ను రెండు విధాలుగా ఉపయోగించుకొవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో దిబ్రుగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అలాగే 40 టన్నుల బరువు ఉండే ఉండే యుద్ధ విమానాలు ల్యాండింగ్‌కు, గరిష్ఠంగా 74 టన్నుల వరకూ బరువు గల సామగ్రితో నిండిన విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుకూలంగా ఈ ఈఎల్ఎఫ్ నిర్మించారు. ఇక భారతదేశంలోని మొదటి ELF ను 2021లో రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో నిర్మించారు.

ఇక అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. అందులో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మధ్యాహ్నం ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే గౌహతి లచిత్ ఘాట్‌ వద్ద రూ. 5,450కోట్ల విలువైన పథకాలను ఆయన ప్రారంభిచనున్నారు. ఇవే కాకుండా ఉన్నత విద్యను ప్రోత్సహించే, డిజిటల్‌ అభివృద్ధికి తోడ్పలే అనేక ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.