PM Modi: త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన!

|

Jan 28, 2025 | 10:08 AM

PM Modi: అమెరికా అధ్యక్షుడు ఇటీవల రెండు సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరంద్ర మోదీ డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్‌ చేశారు. ఈ ఫోన్‌ సంభాషణలు ఇరువురి మధ్య పలు విషయాలను చర్చించారు. త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది..

PM Modi: త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన!
Follow us on

ప్రధాని మోదీ వచ్చేనెలలోనే అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ట్రంప్‌కి మోదీ ఫోన్‌కాల్‌ తర్వాత, అమెరికా అధ్యక్షుడి ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌కి ప్రధాని మోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన.. విశ్వాసపూరిత భాగస్వామ్యానికి- భారత్‌ కట్టుబడి ఉందని ట్రంప్‌కు తెలిపారు మోదీ. భారత్‌-అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలసి పనిచేద్దామని ట్రంప్‌కు వివరించారు మోదీ.

మోదీ, ట్రంప్‌ చర్చలపై వైట్‌హౌస్‌ అధికారిక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్‌కాల్‌లో చర్చ జరిగిందని తెలిపింది. అలాగే రెండుదేశల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్‌, మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఈ ప్రకటనలో వివరించింది. దీంతోపాటు అమెరికా తయారుచేసిన‌ ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్‌కు విజ్ఞప్తి చేసినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్‌ కోరారు. మరోవైపు రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ఈ ఏడాది తొలిసారి భారత్‌లో క్వాడ్‌ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్‌ ఈ ఫోన్‌కాల్‌లో చర్చించారని వైట్‌హౌస్‌ వివరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి