PM Modi: బ్రూనై పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే!

|

Sep 03, 2024 | 9:30 AM

మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం(సెప్టెంబర్ 3) ఉదయం బ్రూనై దారుస్సలాం, సింగపూర్‌లకు బయలుదేరి వెళ్లారు. సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై దారుస్సలాంలో పర్యటిస్తున్నారు.

PM Modi: బ్రూనై పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే!
Pm Modi Brunei And Singapore
Follow us on

మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం(సెప్టెంబర్ 3) ఉదయం బ్రూనై దారుస్సలాం, సింగపూర్‌లకు బయలుదేరి వెళ్లారు. సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై దారుస్సలాంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ బ్రూనై పర్యటన భారత ప్రధాని చేసే తొలి ద్వైపాక్షిక పర్యటన.

ఆ తర్వాత సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ ప్రయాణం సెప్టెంబర్ 4-5 మధ్య ఉండనుంది. ఈ పర్యటనకు బయలుదేరే ముందు, ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాశారు, “రాబోయే రెండు రోజుల్లో నేను బ్రూనై దారుస్సలాం, సింగపూర్‌లను సందర్శిస్తాను. ఈ దేశాలలో వివిధ కార్యక్రమాల సందర్భంగా, ఈ దేశాలతో భారతదేశ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాం.” అని పేర్కొన్నారు.

‘భారత్-బ్రూనై దారుస్సలాం మధ్య దౌత్య సంబంధాలకు 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. హిజ్ మెజెస్టి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాను కలవాలని ఎదురుచూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. సింగపూర్‌లో, ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రి లీ సియన్ లూంగ్, ఎమిరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్‌లతో చర్చలు జరుపుతారు. కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాము ఎదురుచూస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానం, ఇండో-పసిఫిక్ కోసం దృష్టి సారించింది. ఇందులో భాగంగా బ్రూనై, సింగపూర్ వంటి ముఖ్యమైన దేశాలు భాగస్వాములని ప్రధాని మోడీ అభివర్ణించారు.

తన పర్యటన రెండు దేశాలతో మాత్రమే కాకుండా ASEAN ప్రాంతంతో కూడా భారతదేశ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా అధునాతన తయారీ, డిజిటలైజేషన్, స్థిరమైన అభివృద్ధి, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో చర్చల కోసం ఎదురుచూస్తున్నానని’ ఆయన అన్నారు. ఆగ్నేయాసియా దేశాల సంస్థ అయిన ASEANలో సింగపూర్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా ప్రధాన వనరు కావడం విశేషం.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..