PM Modi: ఎన్డీయే ఎంపీలకు ప్రధాని దిశానిర్ధేశం.. రాజ్యసభలో మోదీ ప్రసంగంపై కేంద్రమంత్రి స్పష్టత..

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం సమావేశం పూర్తయింది. పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌ వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్డీఏ పక్షాలకు చెందిన ఎంపీలందరూ ఈ ముఖ్య సమావేశంలో పాల్గొంటున్నారు. ఒకవైపు, రాహుల్‌గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ పక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఎలాంటి కర్తవ్యబోధ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

PM Modi: ఎన్డీయే ఎంపీలకు ప్రధాని దిశానిర్ధేశం.. రాజ్యసభలో మోదీ ప్రసంగంపై కేంద్రమంత్రి స్పష్టత..
Pm Modi
Follow us

|

Updated on: Jul 02, 2024 | 11:54 AM

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం సమావేశం పూర్తయింది. పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌ వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్డీఏ పక్షాలకు చెందిన ఎంపీలందరూ ఈ ముఖ్య సమావేశంలో పాల్గొంటున్నారు. ఒకవైపు, రాహుల్‌గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ పక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఎలాంటి కర్తవ్యబోధ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ విధానాలను చాటిచెప్పడం, ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టడం వంటి అంశాలపై ప్రధాని, ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ సాయంత్రం నాలుగు గంటలకు లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ జవాబు ఇస్తారు. సాయంత్రం ప్రసంగంలో మోదీ జోష్‌ ఒక లెవల్లో ఉంటుందని చెబుతున్నారు. రాహుల్‌గాంధీకి గట్టి కౌంటర్లు ఇస్తారని అంచనాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సమావేశం అనంతరం బయటకు వచ్చిన కేంద్ర మంత్రి రిజిజు దీనిపై స్పందించారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో దేశ సేవ ప్రథమ కర్తవ్యమని ప్రధాని మోదీ చెప్పినట్లు వెల్లడించారు. నిన్నటి సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు సరైనది కాదని అభిప్రాయపడ్డారు. స్పీకర్ మాటలను లెక్క చేయకుండా ఆయననే ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. అలాంటి వాతావరణం తమవైపు నుంచి ఉండకూడదని దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. పార్లమెంట్ నిబంధనలను గౌరవించాలన్నారు. దేశ ప్రధాని ప్రసంగించే సమయంలో దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటారని, దేశ నాయకుడిపై చాలా మంది ఆసక్తిని కనబరుస్తారన్నారు. అందకే పార్లమెంట్ నాయకుడి మాట శ్రద్దగా వినాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా జూన్ 2న పార్లమెంట్‎లో రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపిన తరువాత రేపు ఎగువసభ అయిన రాజ్యసభలో మధ్యాహ్నం 12 తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభ చైర్మెన్ ఆదేశాలను అనుసరించి మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..