రెండు రాష్ట్రాలకు చెందిన ’ఒకే రైల్వే స్టేషన్‘..ఎక్కడుందంటే..

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన ఇండియన్ రైల్వేలో దాగివున్న ఓ వింత ద‌ృశ్యాన్ని మంత్రి సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

రెండు రాష్ట్రాలకు చెందిన ’ఒకే రైల్వే స్టేషన్‘..ఎక్కడుందంటే..
Follow us

|

Updated on: Jul 06, 2020 | 12:38 PM

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన ఇండియన్ రైల్వేలో దాగివున్న ఓ వింత ద‌ృశ్యాన్ని మంత్రి సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. రైల్వే శాఖ మంత్రి పెట్టిన ఆ పోస్ట్‌కు లైకులు, షేర్లు చేస్తూ నెటిజన్స్ తమ స్పందన తెలియజేస్తుండగా, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

భారతదేశంలోని ఓ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన విశిష్టతను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. అంతటి విశేషమైన విషయం ఏంటంటే…అదో రైల్వే స్టేషన్. కానీ, అది సాధారణమైన స్టేషన్ కాదు..రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్న ఒకే రైల్వే స్టేషన్ అది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని నందూర్బార్ జిల్లా నవాపూర్ రైల్వే స్టేషన్‌. దీన్ని గుజరాత్, మహారాష్ట్ర చెరోసగం పంచుకుంటున్నాయి. దీని తాలూకు ఫోటోను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఇటీవల ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. దీంతో తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సూరత్‌-భుసావల్ మార్గంలో నవాపూర్ రైల్వే స్టేషన్ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఈ స్టేషన్ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది. అంటూ పియూష్ గోయల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇలాంటిదే మరో ‘భవానీ మండి’ రైల్వే స్టేషన్. ఇది కూడా మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి విస్తరించి ఉందని మంత్రి వెల్లడించారు.

మరీంకేం…మీరు కూడా అటు ఎప్పుడైనా వెళ్తే…రెండు రాష్ట్రాలను కలుపుతున్న ఆ రైల్వే స్టేషన్లలో ఓ సెల్ఫీ దిగి రండి..ఒకే సారి రెండు రాష్ట్రాలను చుట్టేసినట్లవుతుందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు