Video: మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. మహారాష్ట్ర యవత్‌మాల్‌లో దహన సంస్కారాల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా వరద నీరు పోటెత్తుతుంది. దాంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని యావత్మాల్ వరదలతో అట్టుడుకుతోంది. మండలంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల మధ్య ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
यवतमाळ : पुराच्या पाण्यातून खांद्यावर तिरडी घेऊन मृतदेहावर स्मशनात अंत्यसंस्कार.#yavatmal pic.twitter.com/nLRRtdElaS
— Maharashtra Times (@mataonline) September 8, 2022
దహన సంస్కారాల కోసం వరద నీటిలోనే కొంత మంది మృతదేహాన్ని తమ భుజాలపై మోస్తుకుంటూ వెళ్తున్నారు. మరణించిన వారి అంత్యక్రియలు చేయటం అక్కడి వారికి చచ్చిబతికినంత పనిగా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి