బీజేపీ నేతలతో పవన్ భేటీ..!

|

Jul 07, 2019 | 12:19 AM

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 22వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఇద్దరు నేతలు పలు ఆసక్తికరమైన అంశాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఏపీలో నెలరోజుల వైఎస్ జగన్ పరిపాలనపై ఇరువురి మధ్య చర్చ జరగ్గా.. విభజన హామీలు, ఏపీకి కేంద్రం చేసిన […]

బీజేపీ నేతలతో పవన్ భేటీ..!
Follow us on

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 22వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఇద్దరు నేతలు పలు ఆసక్తికరమైన అంశాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఏపీలో నెలరోజుల వైఎస్ జగన్ పరిపాలనపై ఇరువురి మధ్య చర్చ జరగ్గా.. విభజన హామీలు, ఏపీకి కేంద్రం చేసిన సాయంపై కూడా చర్చించారు. జాతీయ రాజకీయాలు, ఏపీకి కేంద్రం ఇంకా ఏం చేయాల్సి ఉందన్న అంశంపైనా ఇద్దరూ మాట్లాడుకున్నారు.