
పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు.. అత్యంత వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు సభలో కీలక చర్చతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరగనుండగా.. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. కాంగ్రెస్‌కు దీటైన జవాబు చెప్పి తీరుతామని.. ఒక వ్యక్తి మొండితనం కోసమే కాంగ్రెస్ అవిశ్వాసం తెస్తోందని.. స్పీకర్‌పై అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదంటూ రిజుజు పేర్కొన్నారు.
కాగా.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధ పరిణామాలపై చర్చించాలని.. ఖర్గే డిమాండ్ చేశారు. అప్పుడే వంటగ్యాస్ ధరలు పెంచారని.. ముందుగా యుద్ధ పరిస్థితులపై చర్చించాలని విపక్షం పట్టుపట్టింది. విపక్షం నిరసనల మధ్యే రాజ్యసభలో కేంద్రం ప్రకటన చేసింది. పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం.. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఇదిలాఉంటే.. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సస్పెండైన 8 మంది ఎంపీల ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ నినాదాలు చేశారు.