పారిపోయి ప్రియుడితో యువతి పెళ్లి! పాడె కట్టి, ఊరేగించి.. తండ్రి షాకింగ్ డెసిషన్!

గత కొద్ది రోజులుగా అదృశ్యమైన తమ కూతురు కోసం తీవ్రంగా వెదికిన తల్లిదండ్రులకు.. ఆమె తన ప్రియుడితో పారిపోయిందని, అతడ్ని పెళ్లి చేసుకుందని తెలిసి హతాశులయ్యారు. ఈ క్రమంలో వారు తమ కూతురు ఇక తమకు లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తమ కూతురు చనిపోయిందని భావించి ఆమె బొమ్మకు అంత్యక్రియలు జరిపించారు.

పారిపోయి ప్రియుడితో యువతి పెళ్లి! పాడె కట్టి, ఊరేగించి.. తండ్రి షాకింగ్ డెసిషన్!
Teenage Girl

Updated on: Dec 25, 2025 | 6:02 PM

తమ ఇష్టాలను పరిగణలోకి తీసుకోకుండా తనకు నచ్చిన యువకుడితో రహస్యంగా పారిపోయిన యువతి పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా అదృశ్యమైన తమ కూతురు కోసం తీవ్రంగా వెదికిన తల్లిదండ్రులకు.. ఆమె తన ప్రియుడితో పారిపోయి, పెళ్లి చేసుకుందని తెలిసి హతాశులయ్యారు. ఈ క్రమంలో వారు తమ కూతురు ఇక తమకు లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తమ కూతురు చనిపోయిందని ఆమె బొమ్మకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కవిత ఎవరో ఓ వ్యక్తితో తమకు తెలియకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం తీవ్రంగా బాధించిందని యువతి తల్లిదండ్రులు వాపోయారు. అందుకే తమ కూతురు చనిపోయిందని భావించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ యువతి బొమ్మను తయారు చేసి.. చనిపోయినవారికి ఎలా అంత్యక్రియలు చేస్తారో అలాగే నిర్వహించారు.

యువకుడితో పారిపోయి పెళ్లి చేసుకున్న కవిత ప్రతిరూపంలో మట్టిబొమ్మను తయారు చేసి పాడెపై ఉంచి.. గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత స్మశానవాటికకు తీసుకెళ్లి అక్కడ అన్ని ఆచారాలు నిర్వహించారు. అనంతరం కవిత రూపంలో ఉన్న బొమ్మకు నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

అనంతరం కవిత తండ్రి రాంబాబు కుష్వాహా కన్నీళ్లపర్యంతమయ్యాడు. తన కుమార్తె నిర్ణయంతో తమ కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది అత్యంత దారుణమైన, బాధాకరమైన క్షణమని రోధించారు. అయితే, గ్రామంలోని కొందరు కవిత వ్యవహరించిన తీరును తప్పుబడుతుండగా.. మరికొందరు తండ్రి చేసిన పనిని సరికాదని అంటున్నారు. అటు కుమార్తె, ఇటు తండ్రి వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.