Viral: పానీపూరీ వ్యాపారి సంవత్సరం ఆదాయం చూసి.. కళ్లు తేలేసిన అధికారులు

|

Jan 04, 2025 | 8:01 PM

పానీ పూరీ అమ్మె వ్యక్తి GST నోటీసు వచ్చింది. తమిళనాడులో ఈ ఘటన వెలుగుచూసింది. గత ఆర్థిక సంవత్సరంలో అతను లక్షల్లో ఆన్‌లైన్ లావాదేవీలు జరపడంతో అధికారులు నోటీసు పంపారు. దీనిపై నెట్టింట ఓ రేంజ్‌లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Viral: పానీపూరీ వ్యాపారి సంవత్సరం ఆదాయం చూసి.. కళ్లు తేలేసిన అధికారులు
Pani Puri Vendor (Representative image)
Follow us on

తమిళనాడుకు చెందిన పానీపూరీ వ్యాపారికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం నోటీసు పంపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్షికాదాయం రూ.40 లక్షల కంటే ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసు పంపింది. దేశంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు జీఎస్టీ పరిధిలోకి రావు. స్ట్రీట్ వెండర్స్ నడుపుతున్న వ్యాపారులు, ముఖ్యంగా పానీపూరీవాలాలు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆన్‌లైన్ లావాదేవీల ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ట్రానాజక్షన్స్ జరిపే వ్యాపారులపై జీఎస్టీ విధిస్తున్నారు. దీని ప్రకారం తమిళనాడుకు చెందిన పానీపూరీ వ్యాపారికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసు పంపింది.

 వార్షికాదాయం రూ.40 లక్షలు

సదరు వ్యాపారి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపాడు. అతను తన దుకాణంలో ఫోన్ పే,  రోజర్ పే ద్వారా రూ.40 లక్షలు కస్టమర్స్ నుంచి స్వీకరించాడు. మొత్తం లెక్కతీయగా.. సంవత్సరంలో రూ.40,11,019 వచ్చినట్లు తేలింది. కేవలం ఆన్‌లైన్ ట్రాన్‌జాక్షన్స్ ద్వారానే అతను ఇంత సంపాదిస్తే.. ఇక క్యాష్ రూపంలో ఎంత తీసుకున్నాడో మీ ఊహకే వదిలేస్తున్నాం.  దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు జీఎస్టీ నోటీసు పంపింది. పానీ పూరీ వ్యాపారం వార్షిక ఆదాయం రూ.40 లక్షల కంటే ఎక్కువగా ఉన్నందున, ఆ వ్యాపారాలపై జీఎస్టీ పన్ను చెల్లించాలని పేర్కొంది. డిసెంబరు 17న ఆయనకు ఈ నోటీసు పంపారు.

 

స్వయంగా హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాలని  అధికారులు సదరు పానీపూరి వెండర్‌కు సూచించారు. అలాగే, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీ ఖాతా పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.

GST నిబంధనల ప్రకారం రూ. 20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు.. రిజిస్ట్రేషన్  చేసుకోవాలి. కాబట్టి, మీరు కూడా ఏటా జిఎస్‌టికి నమోదు చేసుకోవాలని వ్యాపారికి అధికారులు చెప్పారు. అలా చేయడంలో విఫలమైతే GST చట్టం, 2017లోని సెక్షన్ 23లోని సబ్-సెక్షన్ (2) ప్రకారం జరిమానా విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. పరిమితి దాటిన తర్వాత కూడా జీఎస్టీ నమోదు చేయకపోవడం నేరమని, రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి