Aligarh Muslim University: 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కన్నుమూత.. ఐసీఎంఆర్‌కు లేఖ రాసిన యూనివర్సిటీ

Aligarh Muslim University: అలీగఢ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లపై కరోనా పంజా విసురుతోంది. ఇక్కడ 20 రోజుల్లో 18 మంది ప్రోఫెసర్లు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో..

Aligarh Muslim University: 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కన్నుమూత.. ఐసీఎంఆర్‌కు లేఖ రాసిన యూనివర్సిటీ
Aligarh University

Updated on: May 11, 2021 | 6:14 AM

Aligarh Muslim University: అలీగఢ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లపై కరోనా పంజా విసురుతోంది. ఇక్కడ 20 రోజుల్లో 18 మంది ప్రోఫెసర్లు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో విశ్వవిద్యాలయంలో వ్యాపించిన కోవిడ్‌ స్ట్రెయిన్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ మాస్‌ కమ్యూనికేషన్ ప్రొఫెసర్‌, పీఆర్‌వో షఫీ కిద్వాయ్‌ వెల్లడించారు. మేము 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లను కోల్పోయాం.. మరో వంద మంది టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది జవహర్‌ లాల్‌ నెహ్రూ మెడికల్‌ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.. అని అన్నారు.

మే 8 నాటికి క్యాంపస్‌లో మొత్తం 417 కొత్త కేసులు నమోదు కాగా, 295 మంది కోలుకున్నారు. మొత్తం మీద 40 మంది ప్రస్తుత, మాజీ బోధనా సిబ్బంది, అంతకంటే ఎక్కువ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యూనివర్సిటీ వీసీ తారిక్‌ మన్సూర్‌ సోదరుడు కూడా కరోనాతో కన్నుమూశారు. శనివారం లా విభాగానికి చెందిన ఒక ప్రొఫెసర్‌ మరణించారు.

రుగ్వేదంలో పీహెచ్‌డీ సాధించిన తొలి భారతీయ ముస్లింగా ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్‌ ఖలీద్‌ బిన్‌ యూసఫ్‌ కూడా కరోనాతో కన్నుమూశారు. ఆయనతోపాటు వైద్య విభాగానికి చెందిన షాబాద్‌ ఖాన్‌, న్యాయ విభాగ డీన్‌ షేక్‌ అహ్మద్‌ షందానీ తదితరులు కన్నుమూసిన వారిలో ఉన్నారు.

జన్యువులను గుర్తించండి..

కాగా, యూనివర్సిటీలో సేకరించిన వైరస్‌ నమూనాల జన్యువులను విశ్లేషించాలని వీసీ తారిక్‌ మన్సూర్‌ ఐసీఎంఆర్‌కు లేఖ రాశారు. ఇక్కడ సేకరించిన వైరస్‌ నమూనాలను పంపిస్తున్నాము.. అలీగఢ్‌ ప్రాంతంలో వ్యాప్తి చెందుతున్న స్ట్రెయిన్‌ను గుర్తించండి.. దాని ఆధారంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొంటాం.. అని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Traveling Tips: కరోనా వేళలో తప్పనిసరి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి..ఇలా చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us