
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థగా భావిస్తున్న, పాకిస్తాన్‌కు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) దాడి తామే చేశామని ప్రకటించుకుంది. దీంతో.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తుందని భారత ప్రభుత్వం పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. కానీ, భారత్ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని చెబుతోంది. ఈ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందనే ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో 1993 నాటి సీఐఏ(సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) రిపోర్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. CIAలో అనుభవజ్ఞుడైన బ్రూస్ రీడెల్ ఆధ్వర్యంలో NIE(నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్) రూపొందించింది. అమెరికాకు చెందిన ఈ సీఐఏ అనే పవర్‌ఫుల్ సంస్థ 1993లో భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులపై అధ్యాయం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. అందులో అనేక ఆసక్తికర విషయాలు పేర్కొంది. నిజానికి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఇండియా అంటే పాకిస్థాన్‌కు భయం అని ఆ రిపోర్ట్‌లో సీఐఏ పేర్కొంది. ఒక వేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వస్తే.. అది కశ్మీర్ కారణంగా వస్తుందని కూడా సీఐఏ అంచనా వేసింది. ఒక వేళ ఆ పరిస్థితి వచ్చినా.. ఇండియాకు పాకిస్థాన్ భయపడుతుందని అని తెలిపింది. అందుకు ఆర్థికంగా, సైనిక పరంగానే బలహీనంగా ఉండటమే కారణం. ఒక వైపు ఇండియా అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఇండియాను అందుకోలేదని రిపోర్ట్ వెల్లడించింది.
1993 నుంచి అదే జరుగుతూ వస్తుంది. ఇండియాను అభివృద్ధిలో అందుకోలేని పాకిస్థాన్.. ఆ దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కశ్మీర్‌లోని ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదులతో అనధికారిక పొత్తులు పెట్టుకోవడం వంటివి పాకిస్థాన్ చేస్తుందని సీఐఏ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చేస్తుంటే ఆ అంచనా నిజం అవుతోంది. సైనిక బలం పరంగా, ఆర్థికంగా మనల్ని ఎదుర్కొలేని పాకిస్థాన్.. మన దేశంలో అల్లర్లు సృష్టించి మనల్ని వెనక్కి లాగేందుకు ఉగ్రవాదులతో జట్టు కడుతోంది. ఇలాంటి పరిస్థితులు 1993 కంటే ముందు నుంచే ఉన్నా.. అప్పటి భారత ప్రభుత్వాలు ఎంతో సమర్థవంతంగా ఈ సవాళ్లన్ని ఎదుర్కొంటూ స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ఇండియాను అభివృద్ధి దిశగా నడిపించాయని, కానీ పాకిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని రిపోర్ట్ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..