బాస్మతీ రైస్‌పై పాకిస్తాన్‌ కన్నుపడింది…!

|

Oct 07, 2020 | 10:26 AM

పాకిస్తాన్‌లో బాస్మతీ పండితే పండవచ్చుగాక, కానీ బాస్మతీ మాత్రం భారత్‌కే ప్రత్యేకం.. కమ్మటి వాసనతో ఘుమఘుమలాడే బాస్మతీ బియ్యంతో చేసిన బిర్యానీ రుచే వేరు! అందుకే బాస్మతీకి అంత గిరాకీ! జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) ట్యాగ్‌ కోసం ఇండియా...

బాస్మతీ రైస్‌పై పాకిస్తాన్‌ కన్నుపడింది...!
Follow us on

పాకిస్తాన్‌లో బాస్మతీ పండితే పండవచ్చుగాక, కానీ బాస్మతీ మాత్రం భారత్‌కే ప్రత్యేకం.. కమ్మటి వాసనతో ఘుమఘుమలాడే బాస్మతీ బియ్యంతో చేసిన బిర్యానీ రుచే వేరు! అందుకే బాస్మతీకి అంత గిరాకీ! జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) ట్యాగ్‌ కోసం ఇండియా ఎప్పుడో యూరోపియన్‌ యూనియన్‌లో అప్లై చేసింది.. పోయిన నెల 11న యూరోపియన్‌ యూనియన్‌ జర్నల్‌లో ఇండియాలో పండే బాస్మతీ బియ్యంపై పెద్ద వ్యాసమే వచ్చింది.. ఆ వ్యాసంలో బాస్మతీ వంగడం భారత్‌ ప్రత్యేకతగా పేర్కొన్నారు.. అదే పాకిస్తాన్‌కు కడుపుమంట తెప్పిస్తోంది.. అసలు జీఐ ట్యాగ్‌ భారత్‌కు రానివ్వకుండా చూస్తోంది.. తమ దేశం ఎక్కువగా పండే ఈ వంగడం భారత్‌కు ప్రత్యేకం ఎలా అవుతుందని పాకిస్తాన్‌ ప్రశ్నిస్తోంది.. రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌ ప్రధానమంత్రి వాణిజ్య సలహదారు రజాక్‌ దావూద్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో భారత్‌కు జీఐ ట్యాగ్‌ రాకుండా అడ్డుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు.. నిజానికి పాకిస్తాన్‌లో కూడా బాస్మతీని పండిస్తారు.. అక్కడ పలు రకాల బాస్మతీ పండుతుంది.. యూరప్‌కే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు ఆ బియ్యాన్ని పాకిస్తాన్‌ ఎగుమతి కూడా చేస్తూ ఉంటుంది.. ఆదాయం కూడా బాగానే ఉంటుంది.. ఒకవేళ భారత్‌కు జీఐ ట్యాగ్‌ వస్తే మాత్రం పాక్‌కు ఇబ్బందే! అప్పుడు పాకిస్తాన్‌ బాస్మ‌తీ బియ్యాన్ని ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేయలేదు.. చేయాలనుకుంటే ఇండియా అనుమతి తీసుకోవాలి.. పోన్లే పాపమని భారత్‌ అనుమతి ఇచ్చినా తప్పనిసరిగా భారత్‌కు చెందిన ఏదైనా బ్రాండ్‌ పేరిటే విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది.. బాస్మతీ రైస్‌ జీఐ ట్యాగ్‌ కోసం భారత్‌ అప్లై చేసిన వివరాలను యూరోపియన్‌ యూనియన్‌ జర్నల్‌లో ప్రచురించారు.. మూడు నెలలలోపు ఏదైనా దేశం అభ్యంతరం చెప్పవచ్చు.. అది దాటితే భారత్‌కు జీఐ ట్యాగ్ ఇస్తారు.. ఉత్తినే అభ్యంతరం చెబితే సరిపోదు.. తగిన ఆధారాలు కూడా చూపాలి.. ఇప్పుడు పాకిస్తాన్ ఆ పనిలో ఉంది.. అక్కడ జీఐ ట్యాగ్‌కు సంబంధించిన చట్టాలే లేవు..ముందు చట్టం రూపకల్పన చేయాలి.. ఆ తర్వాత ఆధారాలు సంపాదించాలి.. ఇందుకు చాలా టైమ్‌ పడుతుంది.. ఆ లెక్కన చూస్తే బాస్మతీ రైస్‌కు జీఐ ట్యాగ్‌ మనకే వస్తుంది.. రావాలి కూడా!