పగతీర్చుకుంటున్న పాక్…సంజౌతా ఎక్స్‌ప్రెస్‌కు రద్దు

| Edited By:

Aug 08, 2019 | 4:24 PM

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. ఇప్పటికే భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది.  ఇదిలా ఉంటే తాజాగా భారత్ నుంచి పాక్‌కు వెళ్తున్న సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును కూడా  రద్దు చేస్తున్నట్టు  పాక్ నిర్ణయించింది. సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఇది వారంలో రెండుసార్లు  గురువారం, మంగళవారాల్లో ఇరు దేశాల మధ్య ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుంచి అట్టారీ బోర్డర్ మీదుగా లాహోర్ […]

పగతీర్చుకుంటున్న  పాక్...సంజౌతా ఎక్స్‌ప్రెస్‌కు రద్దు
Follow us on

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. ఇప్పటికే భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది.  ఇదిలా ఉంటే తాజాగా భారత్ నుంచి పాక్‌కు వెళ్తున్న సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును కూడా  రద్దు చేస్తున్నట్టు  పాక్ నిర్ణయించింది.

సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఇది వారంలో రెండుసార్లు  గురువారం, మంగళవారాల్లో ఇరు దేశాల మధ్య ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుంచి అట్టారీ బోర్డర్ మీదుగా లాహోర్ చేరుకునే సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేరు వెనుక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. 1976లో హిందీ-ఉర్దూ మధ్య రాజీ కుదుర్చుతూ ” షిమ్లా ఒప్పందం” జరిగింది. దీనినే “సంజౌతా” అంటారు. అంటే ఒప్పందం అని అర్ధం. ఇదే పేరుతో 1994లో రైలు సర్వీ‌స్‌ను ప్రారంభించారు.

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఫిబ్రవరి 28న సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా రైలును నడిపారు. మరోవైపు భారతీయ సినిమాలను కూడా నిషేదిస్తున్నట్టుగా  పాకిస్తాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ప్రకటించడం చర్చనీయంశంగా మారింది.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ వైఖరిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే అంశాన్ని సాకుగా చేసుకుని విషం చిమ్మే ప్రకటనలు సైతం చేస్తోంది.