భారత సైన్యం సీక్రెట్స్ పై పాక్ కన్ను.. DRDO శాస్త్రవేత్త ముసుగులో మిలిటరీ వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబాటు!

భారత రక్షణ వ్యవస్థ సమాచారం దొంగిలించడానికి పాక్ గూఢచారులు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ఇటీవలే హనీట్రాప్ ద్వారా నేవీ సీక్రెట్స్ రాబేట్టేందుకు ప్రయత్నించిన పాక్.. తాజాగా డిజిటల్ పద్ధతులు అవలంబిస్తున్నారు. హనీ ట్రాపింగ్ నుండి వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి డేటా చోరీకి పాల్పడుతున్నారు. సోనియా అనే గూఢచారి డీఆర్‌డీఓ శాస్త్రవేత్తగా నటిస్తూ 13 రక్షణ గ్రూపుల్లోకి ప్రవేశించి, సున్నితమైన సమాచారం సేకరించినట్టు సమాచారం. దీనితో సాయుధ బలగాలు అప్రమత్తమై, సైబర్ భద్రతపై హెచ్చరికలు జారీ చేశాయి.

భారత సైన్యం సీక్రెట్స్ పై పాక్ కన్ను.. DRDO శాస్త్రవేత్త ముసుగులో మిలిటరీ వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబాటు!
Defence Cyber Alert

Edited By:

Updated on: Nov 23, 2026 | 9:04 PM

భారత రక్షణ వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగలించడానికి పాక్ గూఢచారులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పటి వరకు హనీ ట్రాపింగ్ తో సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిన కేటుగాళ్లు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలో మోసాలకు పాల్పడుతూ వాట్సప్ గ్రూపుల్లో చేరి డేటా చోరికి పాల్పడుతున్నారు. పాకిస్థాన్ ఆధారిత గూఢచారి సంస్థల ఏజెంట్లు భారత సైన్యం, కేంద్ర పారామిలిటరీ దళాలు, సివిల్ డిఫెన్స్ సంస్థలకు చెందిన 13 అనధికార వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడినట్లు తేలింది.

సోనియా అనే పేరుతో ఒక మహిళా పాకిస్థాన్ గూఢచారి, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తగా నటిస్తూ ఆల్ ఇండియా డిఫెన్స్ సివిలియన్ మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ వాట్సాప్ గ్రూపులో చేరింది.ఆమె ఒక సివిలియన్ సిబ్బంది సభ్యుడితో చాటింగ్ చేసి, డబ్బులు ఇచ్చి సున్నితమైన రక్షణ సమాచారాన్ని పొందిందని అధికార వర్గాలకు సమాచారం అందింది..ఈ ఘటన తర్వాత అన్ని సాయుధ దళాలు, పారామిలిటరీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. సిబ్బందిని వెంటనే అనధికారిక డిఫెన్స్ గ్రూపుల నుంచి బయటకు రావాలని ఆదేశించారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు తమ గ్రూపుల్లోని సభ్యుల జాబితాను పరిశీలించి, తెలియని, ధృవీకరించని, అనుమానాస్పద నంబర్లను తొలగించాలని సూచించారు.

పాకిస్థాన్ గూఢచారులు స్పూఫ్డ్ లేదా హ్యాక్ చేసిన భారతీయ ఫోన్ నంబర్ల ద్వారా ఈ గ్రూపుల్లోకి చేరి, సైలెంట్ గా సమాచారం సేకరించారని తెలుస్తోంది. రక్షణ, పారామిలిటరీ దళాల అధిపతులు వాట్సాప్, ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ల్లో సున్నితమైన సమాచారం షేర్ చేయవద్దని సిబ్బందిని కఠినంగా హెచ్చరించారు. సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయంపై జారీ చేసిన సర్క్యులర్‌లో మాలిషియస్ నంబర్లను తొలగించాలని, గ్రూపుల్లో అపరిచితులను అనుమతించకూడదని స్పష్టంగా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us