శత్రుదేశం పాకిస్థాన్ మరో సారి కాల్పులకు తెగబడింది. నూతన సంవత్సరం తొలి రోజే బలగాలు కాల్పులకు దిగాయి. శుక్రవారం రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి, సాయంతం 5.30 గంటలకు కాల్పులు పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. పాక్ యత్నాలను భారత్ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఇక నౌషెరా సెక్టార్‌లో గురువారం రోజు కూడా పాకిస్థాన్ కాల్పులు జరిపింది.