Pahalgam Attack: పాక్‌పై భారత్ ఎకనామిక్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌.. పార్సిల్స్‌ , మెయిల్స్‌ సేవల నిలిపివేత

ఉగ్రదాడిపై చాలా సీరియస్‌గా ఉన్న భారత ప్రభుత్వం. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలని భావిస్తోంది. దీనికోసం రోజుకో కఠిన నిర్ణయాన్ని ప్రకటిస్తోంది. లేటెస్టుగా మరో గట్టి షాకిచ్చింది. పాకిస్తాన్‌ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Pahalgam Attack: పాక్‌పై భారత్ ఎకనామిక్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌.. పార్సిల్స్‌ , మెయిల్స్‌ సేవల నిలిపివేత
India Bans Parcels From Pak

Updated on: May 03, 2025 | 4:41 PM

పాకిస్తాన్‌పై ముప్పేటదాడి చేస్తోన్న మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విర్రవీగుతున్న పాకిస్తాన్‌ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తేనే కరెక్ట్‌ అని కేంద్రం భావిస్తోంది. పాకిస్తాన్‌ దిగుమతులపై నిషేధం విధించారు. ఈ నిషేధం అన్ని వస్తువులకు , ఉత్పత్తులకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దిగుమతులతోపాటు, గూడ్స్‌ ట్రాన్సిట్‌పై కూడా నిషేధం విధించారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి మినహాయింపులు కావాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాలని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌పై భారత్‌ ఆంక్షల పర్వం కొనసాగుతోంది. భారత నౌకాశ్రయాల్లోకి పాకిస్తాన్‌ నౌకలు రాకుండా నిషేధం విధించారు. అదే విధంగా భారత నౌకలు పాక్‌ పోర్టుల్లోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. పహల్గామ్‌ దాడికి పాకిస్తాన్‌ను అన్ని రకాలుగా కౌంటర్‌ ఇస్తోంది భారత్‌. పహల్గామ్‌లో ఉగ్రదాడికి దిగిన పాకిస్తాన్‌ సంగతి చూడాలని కేంద్రం డిసైడ్‌ అయింది. ఇందులోభాగంగా, ఇప్పటికే పాక్‌ జాతీయులను భారత్‌ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. అంతేగాకుండా, పాక్‌ గగనతలాన్ని వాడుకోకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వాణిజ్యపరమైన కఠిన నిర్ణయాలను కూడా కేంద్రం తీసుకుంది. పాకిస్తాన్‌కు వరుస షాకులిస్తోంది భారత్‌. పాకిస్తాన్‌కు పోస్టల్‌ సర్వీసెస్‌ను నిలిపివేశారు. పాక్‌కు మెయిల్స్‌తో పాటు , పార్సిల్‌పై నిషేధం విధించారు. పాకిస్తాన్‌ వెబ్‌సైట్లపై బ్యాన్‌ విధించారు.