TRS protest Paddy procurement: హక్కుల కోసం రైతులు పోరాడుతూనే ఉంటారని రైతు నేత రాకేష్ టికాయత్ పేర్కొ్న్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ.. అబద్దం చెబుతోందంటూ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వరి కొనుగోలుకు ఒకే విధానం ఉండాలని టికాయత్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన నిరసన దీక్షకు బీకేయూ నేత రాకేశ్ టికాయత్ సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఈ సందర్భంగా టికాయత్ కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఏం జరుగుతోందని.. హక్కుల కోసం, గిట్టుబాటు ధరల కోసం రైతులు మరణిస్తూనే ఉండాలా అంటూ ప్రశ్నించారు. హక్కుల కోసం రైతులు పోరాడుతూనే ఉంటారని పేర్కొన్నారు.
ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చేస్తుందని.. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు అంటూ టికాయత్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని.. దీంతోనే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందన్నారు. రైతుల కోసం మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు ఢిల్లీలో 13 నెలల పాటు ఉద్యమించామని గుర్తుచేశారు. కేంద్రం ఏడాదికి మూడు విడతలుగా రైతులకు రూ.6 వేలు ఇస్తూ.. ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతోందని టికాయత్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నారని.. ఇది రాజకీయ ఉద్యమం కాదని టికాయత్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారన్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు టికాయత్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోరాటం అభినందనీయమంటూ బీకేయూ నేత రాకేష్ టికాయత్ ప్రశంసించారు.
we are not here for politics, we are here to demand uniform paddy procurement policy – @RakeshTikaitBKU #OneNationOneProcurement@KTRTRS pic.twitter.com/IDIesR1E9Y
— krishanKTRS (@krishanKTRS) April 11, 2022
Also Read: