Oxygen Express: విశాఖకు చేరుకున్న ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’.. స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌తో పరుగులు తీయనున్న మొట్టమొదటి ట్రైన్

OXYGEN Express reaches Vizag Steel Plant: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ తరుణంలో

Oxygen Express: విశాఖకు చేరుకున్న ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’.. స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌తో పరుగులు తీయనున్న మొట్టమొదటి ట్రైన్
Oxygen Express Trains

Updated on: Apr 22, 2021 | 8:47 AM

OXYGEN Express reaches Vizag Steel Plant: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో ఔషధాలు, బెడ్స్ కొరతనే కాకుండా.. ఆక్సిజన్ కోరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ లేకపోవడంతో చాలాచోట్ల కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రైల్వే ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నారు. దీంతో ద్రవ ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు మొదటి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైలు విశాఖపట్టణానికి చేరుకుంది. ఇక్కడ ద్రవ ఆక్సిజన్‌ను నింపిన వెంటనే మరలా మహారాష్ట్రకు బయలుదేరనుంది. అయితే ఈ గూడ్స్ రైలు మార్గమధ్యంలో ఆగకుండా రైల్వే శాఖ ప్రత్యేక ప్రణాళికలు చేసింది. దీంతోపాటు ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కి సాయుధ దళాలు పహారా కాస్తున్నాయి.

మహారాష్ట్ర నుంచి మొదటి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ సోమవారం సాయంత్రం కలంబోలి యార్డ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు బయలుదేరింది. ఈ మేరకు ట్యాంకర్లను వ్యాగన్లల్లో ఎక్కించడానికి, దింపడానికి వీలుగా ముంబై డివిజన్ కలంబోలి గూడ్స్ యార్డ్ వద్ద ర్యాంప్ కూడా నిర్మించారు. ఈ రైలు వాసై రోడ్, జల్గావ్, నాగ్‌పూర్, రాయ్ పూర్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు చేరుకుంది. ఈ రోజు లిక్విడ్ ఆక్సిజన్‌ను నింపిన వెంటనే మరలా మహారాష్ట్రకు బయలుదేరనుంది.

ఇదిలాఉంటే.. కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌‌ను ప్రైవేటు పరం చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉద్యోగులు, ఏపీ వాసులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అత్యధికంగా సహజ వాయువును ఉత్పత్తి చేస్తూ మన్ననలు పొందుతోంది. కేంద్రం వదిలించుకోవాలని చూసిన ప్లాంటే ఇప్పుడు ఊపిరిపోస్తుందంటూ ఏపీ వాసులు పేర్కొంటున్నారు.

Also Read:

దేశంలో కోవిడ్ పై పోరు మరింత ఉధృతం, రంగంలోకి దిగిన భారత వైమానిక దళం,

india Coronavirus: మృత్యుఘోష.. కరోనాతో ఒక్కరోజే 2,102 మంది మృతి.. రికార్డు స్థాయిలో కేసులు..