Mumbai: ఛీ ఛీ..క్యాంటీన్‌కు వచ్చి అలాంటి పనులు చేయండం ఏంటి ?..చివరికి నోటీసు బోర్డు పెట్టేసిన యాజమాన్యం

|

Apr 15, 2023 | 7:54 AM

ఎక్కడైనా క్యాంటిన్‌లో తిన్న తర్వాత ఆ ఫ్లేట్లు, గ్లాసులు, చెంచాలు అక్కడే పెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే కొంతమంది వాటిని కూడా గుట్టు చప్పడు కాకుండా తీసుకెళ్తుంటారు.

Mumbai: ఛీ ఛీ..క్యాంటీన్‌కు వచ్చి అలాంటి పనులు చేయండం ఏంటి ?..చివరికి నోటీసు బోర్డు పెట్టేసిన యాజమాన్యం
Notice Board At Canteen
Follow us on

ఎక్కడైనా క్యాంటిన్‌లో తిన్న తర్వాత ఆ ఫ్లేట్లు, గ్లాసులు, చెంచాలు అక్కడే పెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే కొంతమంది వాటిని కూడా గుట్టు చప్పడు కాకుండా తీసుకెళ్తుంటారు. అలాంటి ఘటనలే ముంబయిలోని బృహన్‌ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న క్యాంటిన్‌లో జరుగుతున్నాయి. అక్కడ సిద్ధివినాయక్ క్యాటరర్స్ పేరుతో క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్‌కు బీఎంసీలో పని చేసే ఉద్యోగులతోపాటు ఇతరులు కూడా వచ్చి టిఫిన్లు, భోజనాలు చేస్తుంటారు. అలా వచ్చిన వారు తిన్న తర్వాత అక్కడి చెంచాలను, టిఫిన్‌ ప్లేట్లను, గ్లాస్‌లను బ్యాగులో వేసుకొని వెళ్లిపోతున్నారట.

దీంతో క్యాంటీన్‌ పరిసరాల్లోనే తినాలని, బయటకు తీసుకెళ్లొద్దని క్యాంటీన్ యాజమాన్యం వినియోగదారుల్ని కోరుతూ ఓ నోటీసు బోర్డు పెట్టింది. క్యాంటీన్‌లోని వస్తువులను ఖాతాదారులు బయటకు తీసుకెళ్లిపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కనిపించడం లేదు. దీనివల్ల మిగతా ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆ నోటీసు బోర్టులో తెలిపింది. అలగే ఇక్కడి వస్తువులను ఎవరూ బయటకు తీసుకెళ్లొద్దని.. ఇప్పటి వరకు 6000కు పైగా చెంచాలు, 400 ప్లేట్లు, 100కు పైగా గ్లాసులు పోయాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి