దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం.. 350కి పైగా వాహనాలు దగ్ధం..షాకింగ్‌ వీడియో వైరల్

సోనియా విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీరాబాద్ మల్ఖానాలో ఆదివారం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 350 వరకు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారి ఒకరు తెలిపారు. కాలిపోయిన 345 వాహనాల్లో 260 ద్విచక్ర వాహనాలు, 85 కార్లు ఉన్నాయని అధికారి తెలిపారు.

దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం.. 350కి పైగా వాహనాలు దగ్ధం..షాకింగ్‌ వీడియో వైరల్
Delhi Fire Accident

Updated on: Apr 06, 2025 | 12:23 PM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈశాన్య ఢిల్లీకి చెందిన సోనియా విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీరాబాద్ మల్ఖానాలో ఆదివారం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 350 వరకు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారి ఒకరు తెలిపారు. కాలిపోయిన 345 వాహనాల్లో 260 ద్విచక్ర వాహనాలు, 85 కార్లు ఉన్నాయని అధికారి తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

గత మూడు రోజుల్లో ఒక మల్ఖానాలో మంటలు చెలరేగడం ఇది రెండోసారి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

వీడియో ఇక్కడ చూడండి..

ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు యార్డ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. మంటలను అదుపు చేయడానికి మొత్తం ఏడు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపుచేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..