వయనాడ్‌లోని కొండ ప్రాంతాల్లో టీఎస్టేట్‌లు ఎక్కువగా ఉంటాయి. అక్కడే పనిచేస్తూ, అక్కడే కాపురముంటున్న 600మంది ఆచూకీ..ఇప్పుడు తెలియడం లేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎగువ నుంచి కొండచరియలు, బురద విరుచుకుపడిన చోట పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, NDRF, పోలీసులు, ఫైర్‌ఫైటర్లతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాలంటీర్లు వందల మంది ఇప్పుడు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..