అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో కిల్లర్.. ఎందుకో తెలిస్తే..

రన్నింగ్‌ ట్రైన్‌లోంచి ప్రయాణికులను బయటకు నెట్టేసి చంపుతున్న ఓ సైకో కిల్లర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గత కొన్ని రోజులుగా ఆర్పీఎఫ్ అధికారినని చెప్పుకుంటూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తే.. ఇచ్చేందుకు నిరాకరించిన వారిని హింసించడం, లేదా ట్రైన్‌లోంచి తోసేయడం వంటి ఘాతుకాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో కిల్లర్.. ఎందుకో తెలిస్తే..
Train Psycho Killer Arrest

Updated on: Sep 24, 2026 | 6:57 PM

సెప్టెంబర్ 19న ట్రైన్‌లోంచి ఓ ప్రయాణికుడిని కిందకు తోసేసి చంపేసిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకే అరెస్ట్ చేశారు వారణాసి పోలీసులు. నిందితుడిని భోజ్‌పూర్ జిల్లా బరిస్వాన్ గ్రామానికి చెందిన రోహిత్ తివారీగా గుర్తించారు. ఇతను గత కొద్ది రోజులుగా ట్రైన్‌లో నుంచి ప్రయాణికులను తోసి హత్య చేస్తున్న సైకో కిల్లర్‌ అని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు తాను ఆర్పీఎఫ్‌ అధికారినని చెప్పుకుంటూ గత కొన్ని రోజులుగా ట్రైన్‌లోని ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పిల్లలు, టికెట్టు లేని ప్రయాణికులు, ట్రైన్‌లో సిగరేట్, మందు తాగే వారిని టార్గెట్‌గా చేసుకొని డబ్బులు డిమాండ్ చేసేవాడని.. డబ్బులు ఇవ్వని వారిని వేధించడంతో పాటు కాళ్లు చేతులు కట్టేసి ట్రైన్‌లోంచి తోసేసే వాడని పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 19న కూడా ఇలానే హైదరాబాద్‌లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న నితిన్ కుమార్ (21) అనే యువకుడిని తివారీ కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. అంతకు ముందు తివారి బాధితుడి ఫోన్ నుంచి వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఇక కొడుకు కనిపించకపోవడంతో బాధితుడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటననై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆరా, జగ్జీవన్ హాల్ట్ మధ్య రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు నితిన్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం తన కుమారుడిదేనని నితిన్ తండ్రి కూడా నిర్ధారించారు. దీంతో పోలీసులు పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని.. ఇంతకు ముందే 25 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us