Operation Sindoor: పాక్‌పై మెరుపు దాడులు.. దాదాపు 100 మంది వరకూ హతం.!

Updated on: May 07, 2025 | 11:58 AM

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. ఒక్క బహావల్‌పూర్‌లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఎటాక్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. ఒక్క బహావల్‌పూర్‌లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మంది వరకూ టెర్రరిస్ట్‌లు హతమైనట్టు సమాచారం. అర్ధరాత్రి ఒంటిగంటా 28 నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. రాజస్థాన్‌లోని ఖజువాలా నుంచి వైమానిక దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఆరు చోట్ల దాడులు జరిగినట్లు చెబుతోంది పాక్‌ సైన్యం. నిజానికి తొమ్మిదిచోట్ల దాడులు చేసింది భారత్‌ సైన్యం. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతున్నాయి. యుద్ధంలో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌లు, పైలట్లు భారత్‌కు సేఫ్‌గా తిరిగివచ్చారు. మొత్తం తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసింది ఆర్మీ. పాకిస్తాన్‌లో నాలుగు ప్రాంతాలు.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరిపింది.

ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు. ఇవాళ 11 గంటలకు CCS కీలక భేటీ జరగనుంది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సింధూర్‌’ అని నామకరణం చేసింది కేంద్రం. పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్లముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. ఆఅర్థంలోనే ఈ ఆపరేషన్‌కు ఆ పేరు ఖరారు చేసింది. కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి గాంచిన కశ్మీర్‌ లోయలో పహల్గామ్‌ ఉగ్రదాడులతో పాకిస్తాన్‌ రక్తం పారించింది. పాక్‌ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం.

టెర్రర్ క్యాంప్‌లపై భారత్‌ దాడులతో ఉడికిపోయిన పాకిస్తాన్.. LOC వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. కాల్పులతోపాటు, మోటార్‌ షెల్స్‌ ప్రయోగించింది పాక్‌ సైన్యం. పాక్‌ దాడుల్లో ముగ్గురు భారత పౌరుల దుర్మరణం పొందారు. యూరీ సెక్టార్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మరికొందరు పౌరులు. మోస్ట్‌ వాంటెడ్‌ మసూద్‌ అజర్‌ డెన్‌ బహావల్‌పూర్‌లోనే ఉన్నారు. రాత్రి బహావల్‌పూర్‌లోని 2 ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపించిన భారత్ సైన్యం.. జైషేకి చెందిన 2 టెర్రర్‌ క్యాంప్‌లు నేలమట్టం చేసింది. మసూద్‌ అజర్ ఏమయ్యాడనే దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. భారత్‌ ఆపరేషన్‌పై ఎప్పటికప్పుడు క్లోజ్‌గా మానిటర్‌ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. భారత్ యాక్షన్‌కి కౌంటర్‌గా పాక్‌ ఎటువంటి చర్య తీసుకోవద్దు.. భారత్‌పై యుద్ధానికి పాక్ ధైర్యం చెయ్యొద్దన్నారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కి ఉంది.. ఆపరేషన్ సింధూర్‌పై పాక్‌ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు.

పాక్ ప్రజల వీడియో క్లిప్

ఇక పాక్ భూభాగంపై భారత్ మెరుపు దాడులు చేయడంపై ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి.. దాడులు ఎలా చేయగలిగాయని ఆ దేశ ప్రధానిని ఏకీపడేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ క్లిప్‌లో బహవల్పూర్‌లోని మసూద్ అజార్ మదర్సాపై నాలుగు క్షిపణులు దాడి చేసినట్టు మనం చూడవచ్చు. ఇక ఈ మెరుపు దాడులతో పాక్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారిస్తాయని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Published on: May 07, 2025 07:59 AM