Ayodhya: రామయ్య విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సెలవు.. పూర్తి వివరాలు..

జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని కార్యాలయాలకు హాఫ్‌ డే సెలవును ప్రకటించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు కార్యాలయాలు పనిచేయవు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు...

Ayodhya: రామయ్య విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సెలవు.. పూర్తి వివరాలు..
Ayodhya Temple

Updated on: Jan 18, 2024 | 4:56 PM

హిందువుల చిరకాల స్వప్నం, అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి సర్వంసిద్ధమైంది. ఈ నెల 22వ తేదీన ఆయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి సర్వం సిద్ధైంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలోపై దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది.

జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని కార్యాలయాలకు హాఫ్‌ డే సెలవును ప్రకటించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు కార్యాలయాలు పనిచేయవు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోస్టాఫీసులు, బ్యాంకులతో పాటు పలు కేంద్రీయ సంస్థలో ఈ సెలవు అమలు కానున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్కూళ్లకు ఫుల్‌ డే సెలవును ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలో ఈనెల 22వ తేదీన పాఠశాలలను మూసి వేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సెలవుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున ఉత్త ప్రదేశ్‌లో మద్యం దుకాణాలను కూడా మూసి వేస్తున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులను 21వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. అయితే 22వ తేదీని సెలవుగా ప్రకటిస్తారా లేదో చూడాలి. ఇక తెలంగాణలో 22వ తేదీన సెలవు ప్రకటిస్తారా లేదా అన్ని దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..