Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. గత ఏడాదికిపై విజృంభించిన కరోనా ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ ఆదేశాలన్నింటికి పాకుతోంది. ఈ వేరియంట్ కేసులు భారత్ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ముందుస్తు చర్యలు చేపట్టకపోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఒమిక్రాన్ ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లకు పెద్దగా పని చేయవనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కు చేరింది. ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో 20కి చేరాయి. మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్‌లో 9, గుజరాత్ 4, కర్ణాటకలో 3, ఢిల్లీలో 2, ఛండిగఢ్‌లో 1, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో 12 సంవత్సరాల బాలికకు ఒమిక్రాన్ వ్యాపించింది. బాలిక కుటుంబం ఇటీవల నైజీరియా నుంచి మహారాష్ట్రకు వచ్చింది. వారికి ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ వారికి నెగెటివ్ వచ్చింది. వారు ఇంటికి చేరుకున్న రెండు, మూడు రోజుల తర్వాత పంటి నొప్పి ఉందని ఆస్పత్రికి వెళ్లడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించగా, ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది. వెంటనే జన్యు పరీక్షలు చేయగా, ఆమెకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.
యూకేలో తొలి మరణం:
యూకేలో అధికంగా ఉన్న ఒమిక్రాన్.. వేగంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నిన్న ఒమిక్రాన్ తొలి మరణం సంభవించింది. దీంతో ఆదేశం మరింత అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఆ దేశంలో ఆంక్షలు విధిస్తుండగా, తొలి కరోనా మరణం నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు.
కరోనా మహమ్మారి వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, ఇతర ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరోనా నుంచి ప్రజలు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు. కరోనా వచ్చిన రెండేళ్లలో ఎన్నో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలను అతలాకుతం చేస్తున్నాయి. ప్రస్తుతం చేపట్టిన చర్యల వల్ల, వ్యాక్సినేషన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో విరుచుకుపడుతోంది. ఇటీవల అత్యంత ప్రమాదకరంగా ఉన్న డెల్టా వేరియంట్‌కు మించేలా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపించడంతో మరోసారి ప్రపంచ దేశాల ప్రజలను ఆందోళకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు 57దేశాలకుపైగా ఈ కొత్త వేరియంట్ పాకింది. ఈ వేరియంట్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందోనని భయాందోళన చెందుతున్నారు.
మళ్లీ ఆంక్షలు..
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ వేరియంట్ కారణంగా పలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు.. మళ్లీ ఎక్కడ లాక్‌డౌన్ విధిస్తారోనని ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి: